గుంటూరు జిల్లా యడ్లపాడుకు చెందిన దాట్ల గోపీవర్మ , మర్రిపాలెంనకు చెందిన కొమ్మూరి ప్రేమ్ చంద్ ఇద్దరూ స్నేహితులు. ప్రేమ్ చంద్ ఓ వివాహితతో సంబంధం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అదే వివాహితకు గోపీవర్మ కూడా దగ్గరయ్యాడు. ఇటీవల ప్రేమ్ చంద్‌కు వివాహం జరిగింది. అయినప్పటికీ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. తన స్నేహితుడు గోపీవర్మ అదే వివాహితతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న విషయం ప్రేమ్ చంద్‌కు తెలిసింది. ఈ విషయంపై ప్రేమ్ చంద్‌కు, గోపీవర్మతో వివాదం తలెత్తింది.
ఈనెల 2న ఇద్దరి మధ్య మరోసారి వివాదం జరిగింది. దీంతో తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న గోపీవర్మను కడతేర్చాలని ప్రేమ్ చంద్ నిశ్చయించుకున్నాడు. పథకం ప్రకారం గోపీవర్మతో గడ్డిమందు కలిపిన శీతల పానీయం తాగించాడు. అతడిని గుంటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న అతను ఆరోగ్యం విషమించి నేడు మృతిచెందాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:
'కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. వైకాపా నేతలు కోట్లు దండుకుంటున్నారు'