ETV Bharat / entertainment

రోషన్ ఫ్యామిలీపై నెట్​ఫ్లిక్స్​ డాక్యుమెంటరీ - అప్పుడు నయన్, ఇప్పుడు హృతిక్​!

రోషన్ ఫ్యామిలీపై నెట్​ఫ్లిక్స్​ డాక్యుమెంటరీ - ఇందులో ఏం చూపించనున్నారంటే?

Hrithik Roshan Family Documentary
Hrithik Roshan (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : 11 hours ago

Hrithik Roshan Family Documentary : ఇటీవలే నయనతార డాక్యూమెంటరీతో నెట్​ఫ్లిక్స్​ పేరు నెట్టింట తెగ మార్మోగిపోగా, ఇప్పుడు మరో స్టార్ హీరో ఫ్యామిలీ గురించి ఇదే ఓటీటీ సంస్థ ఓ స్పెషల్ డాక్యుమెంటరీని రూపొందించనుంది. బీటౌన్​ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ కుటుంబం గురించి 'ది రోషన్స్‌' అనే పేరిట ఓ స్పెషల్ డాక్యుమెంటరీ రానున్నట్లు తెలిపింది.

"ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి రోషన్‌ ఫ్యామిలీ ఎన్నో సేవలు చేసింది. ఆ కుటుంబంలోని మూడు తరాల వారి గురించి ఈ డాక్యుమెంటరీలో చూపనున్నాం. హృతిక్‌, ఆయన తండ్రి రాకేశ్‌ రోషన్‌, తాతయ్య రోషన్‌ సినీ పరిశ్రమకు అందించిన సేవల గురించి 'ది రోషన్స్‌'లో చూపించనున్నాం. హిందీ చిత్ర పరిశ్రమకు ఎంతో సేవ చేసి, మరుపురాని జ్ఞాపకాలను అందించింది ఈ కుటుంబం. వీరి ప్రయాణంలోని ఒడుదొడుకులు, అద్భుతాలను త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా చూడండి" అని నెట్​ఫ్లిక్స్ పేర్కొంది.

2000లో హృతిక్‌ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తన తండ్రి రాకేశ్‌ రోషన్‌ డైరెక్షన్​ల్​లో తెరకెక్కిన 'కహో నా ప్యార్‌ హై' సినిమాతో సినీ తెరంగేట్రం చేశారు. తొలి సినిమాతోనే ఈ స్టార్ కిడ్ విజయాన్ని అందుకున్నారు. ఆ ఏడాది ఎక్కువ వసూళ్లు సాధించిన సినిమాగా ఆ చిత్రం నిలిచింది. అంతేకాకుండా ఉత్తమ నటుడిగా పురస్కారాలను అందుకున్నారు. ఆ తర్వాత వరుస సినిమాలతో బీటౌన్ ప్రేక్షకులను అలరించారు. యాక్టింగ్​లోనే కాకుండా డ్యాన్స్​లోనూ దిట్ట అనిపించుకున్నారు.

ఇక 'ఫైటర్‌'తో ఈ ఏడాది ప్రేక్షకులను అలరించారు. ప్రస్తుతం ఆయన 'వార్‌ 2' కోసం వర్క్ చేస్తున్నారు. 'బ్రహ్మాస్త్ర' ఫేమ్ డైరెక్టర్ అయాన్‌ ముఖర్జీ ఈ సినిమాను భారీ బడ్జెట్​తో తెరకెక్కిస్తున్నారు. సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 'వార్​ 1' లో టైగర్​ ష్రాఫ్​ కనిపించగా, ఇప్పుడీ సీక్వెల్​లో జూనియర్ ఎన్​టీఆర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. భారీ అంచనాల నడుమ వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పలు కీలక సన్నివేశాలను తెరకెక్కించారని సమచారం.

నా తప్పులు సరిదిద్దేందుకు షూటింగ్​ స్పాట్​లో రజనీ అలా చేసేవారు : హృతిక్ రోషన్

అద్దె ఇళ్లలో సెలబ్రిటీలు - రెంట్​కు ఇచ్చేది కూడా సినీ తారలే! - Celebrities Living In Rental Houses

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.