ఇటీవల గుంటూరు జిల్లా నరసరావుపేటలో అత్యాచారానికి గురైన బాలిక తల్లిదండ్రులను మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. కేసును విరమించుకోవాలని నిందితుల తరఫు వాళ్లు బెదిరిస్తున్నారని బాలిక తల్లిదండ్రులు వాసిరెడ్డి పద్మతో మొరపెట్టుకున్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని ఆమె వారికి ధైర్యం చెప్పారు. చిన్నారులపై అత్యాచారానికి పాల్పడే వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఇదీ చూడండి: