గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఈమనిలో స్థానికులు ఇసుక లారీలను అడ్డుకున్నారు. లారీలు తమ గ్రామం మీదుగా అధిక వేగంతో వెళ్తున్నాయని..తద్వారా ప్రమాదాలు జరుగుతున్నాయని వారు వాపోయారు. రోడ్లపైకి రావాలంటే భయంగా ఉందని.. నిర్ణీత బరువు కంటే అధిక లోడుతో వెళ్లటం ద్వారా రహదారులు పాడవుతున్నాయన్నారు. తాము ఎన్నిసార్లు చెప్పినా...లారీడ్రైవర్లు వినిపించుకోవటం లేదని వాపోయారు. అధికారులు జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
ఇదీచదవండి