ETV Bharat / state

గుంటూరులో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

రోడ్లపై ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలు, రణగొణ ధ్వనులు సృష్టించే ర్యాష్ డ్రైవర్లపై గుంటూరు ట్రాఫిక్ పోలీసులు కొరడా జులిపించారు. నగరంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించిన ట్రాఫిక్ పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపిన పలువురు ద్విచక్ర వాహన చోదకులను అదుపులోకి తీసుకున్నారు.

గుంటూరులో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్
author img

By

Published : Apr 25, 2019, 6:06 PM IST

గుంటూరులో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్
గుంటూరులో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

గుంటూరు నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేకడ్రైవ్ నిర్వహించారు. రోడ్లపై స్నేక్ డ్రైవింగ్, ఫైర్ కటింగ్ డ్రైవ్ చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సైలెన్సర్ లేకుండా విపరీతమైన శబ్దాలు కల్గించే వాహన చోదకులపై కేసులు నమోదు చేసి, వీరి వద్ద నుంచి 12 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ సుప్రజ వీరికి ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. వాహనాలకు విపరీతమైన శబ్దాలు చేసే పరికరాలను అమరుస్తున్న మెకానిక్​లపైనా క్రిమినల్ కేసులు పెడతామని డీఎస్పీ హెచ్చరించారు. పిల్లలకు ద్విచక్రవాహనాలు ఇచ్చేముందు తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని డీఎస్పీ సుప్రజ కోరారు..

Intro:ఆమె ఓ నిరుపేద కుటుంబానికి చెందిన వృద్ధురాలు. ఆమె భర్త ఓ కవి. ఆమెకు ప్రభుత్వం నుంచి వితంతు పింఛను వస్తోంది. గత ఎనిమిదేళ్లుగా ఆమె పొందుతున్న పింఛన్ లో సగం మాత్రమే వినియోగిస్తోంది . తాజాగా గత నాలుగు నెలలుగా ఆమె తన పింఛను సొమ్ములో సగం మొత్తాన్ని పింఛను పొందని నిరుపేద కుటుంబానికి అందిస్తోంది. ఆ వృద్ధురాలు దాతృత్వం తెలియాలంటే ఇది చూడండి.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట పట్టణానికి చెందిన ఆదివారపు పేట లో నివసిస్తున్న బనిశెట్టి పార్వతమ్మ అనే వృద్ధురాలు కు ఎనిమిదేళ్లుగా వితంతు పింఛను తీసుకొని జీవనం సాగిస్తోంది . 200 రూపాయల నుంచి అంచెలంచెలుగా పింఛన్ మొత్తం రెండు వేలకు చేరింది. తక్కువ పెంచిన ఉన్నప్పుడు ....ఎక్కువ పింఛను వస్తున్నప్పుడు .. ఆమెది ఒక్కటే లక్ష్యం . మానవసేవే మాధవ సేవ అంటూ తన పింఛన్ లోని సగం మొత్తాన్ని పింఛను నోచుకోని నిరుపేద కుటుంబానికి ఇవ్వడం గమనార్హం.

ఈ క్రమంలో నరసన్నపేట కు చెందిన చైతన్య భారతి అనే స్వచ్ఛంద సంస్థ పార్వతమ్మ సేవాభావాన్ని గమనించి ఓ నిరుపేద కుటుంబాన్ని ఎంపిక చేసింది . నరసన్నపేట లోని దేశవనిపేట వీధిలో ఉంటున్న దామోదర జగన్నాథం దంపతులను గుర్తించింది . దామోదర జగన్నాథం కొన్నేళ్లుగా వృద్ధాప్య పింఛన్ కోసం ఎదురుచూస్తున్నారు. వయస్సునమోదులో తేడా కారణంగా జగన్నాథంకు ఇప్పటివరకు పింఛను మంజూరు కాలేదు. ఇటీవల తన వయసు అర్హతకు సరిపోయినా మరో చుక్కెదురయింది. అది ఏంటంటే దామోదర జగన్నాథంకు సొంత ఇల్లు కూడా లేదు . కానీ సాధికార సర్వే లో ఆరు ఎకరాల భూమి ఉన్నట్టు నమోదైంది. దీంతో జగన్నాథంకు పింఛను మంజూరులో మరో సమస్య ఎదురైంది.

ఇలా ఇబ్బంది పడుతున్న దామోదర జగన్నాథం సమస్య భారతి సంస్థకు చేరింది. ఈ క్రమంలో
అటు పార్వతమ్మ ఉదారత్వం.... ఇటు జగన్నాథం జీవన సమస్య పరిష్కరించేందుకు నడుం కట్టింది . పార్వతమ్మను ఒప్పించి ప్రతి నెల ఆమె పింఛన్ లో సగభాగం జగన్నాథం కుటుంబానికి ఇవ్వ చూపింది . ఇలా గత నాలుగు నెలలుగా బని శెట్టి పార్వతమ్మ తన పింఛన్ లో సగం మొత్తాన్ని జగన్నాదం కుటుంబానికి నెల నెలా ఇస్తోంది. ఆమె ఆదర్శానికి నరసన్నపేట ప్రజలు ప్రశంసిస్తున్నారు

Body:నరసన్నపేట

Conclusion:9440319788

For All Latest Updates

TAGGED:

PRABHUSARMA
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.