ETV Bharat / state

బాపట్లలో ముగ్గురికి కరోనా పాజిటివ్

బాపట్లలోని రెండు కాలనీల్లో ముగ్గురికి కరోనా పాజిటివ్‌ వచ్చిందని అధికారులు వెల్లడించారు. అప్రమత్తమైన అధికారులు రెండు ప్రాంతాలను రెడ్​జోన్లుగా ప్రకటించారు. బాధితులతో కాంటాక్ట్​లో ఉన్న 10 మందిని గుర్తించి క్వారంటైన్​కు తరలించారు.

three people tested corona positive at bapatla in guntur district

author img

By

Published : Jun 3, 2020, 1:32 PM IST

గుంటూరు జిల్లా బాపట్లలోని నరాలశెట్టివారి పాలేనికి చెందిన ఓ మహిళకు, బేతనీ కాలనీకి చెందిన దంపతులకు కరోనా సోకినట్లు పరీక్షల్లో నిర్ధరణ అయ్యింది. వీరికి రెండ్రోజుల క్రితం ఏపీ హెచ్‌ఆర్డీఐ క్వారంటైన్‌ కేంద్రంలో కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించగా... ఫలితాల్లో ముగ్గురికి పాజిటివ్ వచ్చినట్లు తేలిందని అధికారులు తెలిపారు.

డీఎస్పీ శ్రీనివాసరావు, పురపాలిక కమిషనర్‌ భానుప్రతాప్‌, కొవిడ్‌-19 వైద్యాధికారి భాస్కరరావు అప్రమత్తమై... సిబ్బందితో బాధితులు ఉన్న ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరించారు. రెండు ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. బాధితులతో ప్రాథమిక, ద్వితీయ కాంటాక్ట్‌లో ఉన్న పదిమందిని గుర్తించి ఏపీ హెచ్‌ఆర్డీఐ క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు.

ఇదీ చదవండి: కరోనా రికార్డ్: కొత్తగా 8,909 కేసులు, 217 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.