ETV Bharat / state

మాకొద్దీ ఎమ్మెల్యే.. తాడికొండలో కార్యకర్తల ఆగ్రహం

MLA Sridevi Faces Heat From Own Cadre: గుంటూరు తాడికొండలో వర్గపోరు మరోసారు భయటపడింది. తమ ఎమ్మెల్యే ప్రవర్తనతో పార్టీకి నష్టం జరుగుతుందంటూ వైసీపీ కార్యకర్తలు విమర్శించారు. ఎమ్మెల్యే శ్రీదేవి డౌన్ డౌన్ అంటూ నినాదాలు నినాదాలు చేశారు. ప్రశ్నించిన సొంత పార్టీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

MLA Sridevi Faces Heat From Own Cadre
ఎమ్మెల్యే శ్రీదేవి
author img

By

Published : Dec 30, 2022, 4:41 PM IST

Updated : Dec 30, 2022, 5:00 PM IST

Thadikonda MLA Sridevi: గుంటూరు జిల్లా తాడికొండలో.. తాడికొండ, తుళ్లూరు మండలాల స్థానిక వైసీపీ నాయకుల సమావేశం రసాభాసగా మారింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, మర్రి రాజశేఖర్, తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, కత్తెర సురేష్, పోచ బ్రహ్మానంద రెడ్డి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఎమ్యెల్యే శ్రీదేవి మాట్లాడేందుకు సిద్ధం కాగా.. కార్యకర్తలంతా ఒక్కసారిగా పైకి లేచి శ్రీదేవి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. శ్రీదేవి ప్రవర్తనతో పార్టీకి అన్యాయం జరుగుతుందని ఆరోపించారు. ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతుందని మండిపడ్డారు. ఆమె కార్యకర్తలను పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో కుర్చీలు విసిరివేశారు. ప్రశ్నించిన సొంత పార్టీ కార్యకర్తలపైనే అక్రమ కేసులు పెట్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీదేవి తెదేపా పార్టీ మనిషిగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. సమావేశం ఉద్రిక్తతగా మారడంతో, పోలీసులు కలగజేసుకొని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

మాకొద్దీ ఎమ్మెల్యే.. తాడికొండలో కార్యకర్తల ఆగ్రహం

అనంతరం మర్రి రాజశేఖర్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కార్యకర్తల ప్రవర్తన బాగా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు బెదిరిస్తే పార్టీ భయపడదని అన్నారు. అన్ని నియోజకవర్గాల్లో పార్టీలో వివిధ సమస్యలు ఉన్నాయని తెలిపారు. కార్యకర్తల సమస్యలు పరిష్కరించేందుకే గ్రామాలో తిరుగుతున్నామని వెల్లడించారు. కార్యకర్తల సమస్యలు తెలుసుకునేందుకు పార్టీ ప్రత్యక బృందాని ఏర్పాటు చేసిందని రాజశేఖర్ తెలిపారు. సమస్యలు ఏమైనా ఉంటే సామరస్యంగా మాట్లాడుకోవాలని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తల ఆగ్రహంతో, తాడికొండ ఎమ్యెల్యే శ్రీదేవి మాట్లాడకుండానే సభ నుంచి వెళ్లిపోయారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 30, 2022, 5:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.