ETV Bharat / state

వైకాపా నాయకుల దాడులకు పోలీసుల సహకారం: తెదేపా నేతలు

గుంటూరు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను నివారించాలని కోరుతూ .. తెదేపా నేతలు గుంటూరు రేంజ్ ఐజీని కలిసి వినతిపత్రాన్ని అందచేశారు. అధికార పార్టీ నాయకులు చేసే అక్రమాలు, దాడులకు కొంత మంది పోలీసులు సహకరిస్తున్నారని వారు ఆరోపించారు.

tdp leaders complaints to guntur range ig about ycp followers attacks on tdp followers
గుంటూరు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను నివారించాలన్న తెదేపా నేతలు
author img

By

Published : Jul 2, 2020, 6:03 PM IST

గురజాల నియోజకవర్గంలో తెదేపా శ్రేణులపై దాడులను నివారించాలని... గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. పల్నాడులో తెదేపా కార్యకర్తలపై వైకాపా కార్యకర్తల దాడులు, దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయన్నారు. గురజాలలో పార్టీ దళిత నేత విక్రమ్ హత్య చేశారని... పలువురి కాళ్లు చేతులు విరగ్గొట్టారన్నారు. పిన్నెల్లి గ్రామంలో తెదేపా కార్యకర్తలపై 4రోజుల నుంచి దాడులు జరుగుతున్నాయన్నారు. దాడులను ఆపాల్సిన మాచవరం ఎస్ఐ లక్ష్మీ నారాయణరెడ్డి వైకాపా కార్యకర్తగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. తక్షణమే విక్రమ్ హత్యకు కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు.

గుంటూరు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న దాడులను నివారించాలన్న తెదేపా నేతలు

13 నెలల నుంచి పల్నాడులో తెదేపా నేతలపై దాడులు జరుగుతున్నాయని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు చేసే అక్రమాలు, దాడులకు కొంత మంది పోలీసులు సహకరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు నిష్పక్షపాతంగా పనిచేయాలని.. దాడులకు సహకరించే పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

వైకాపా ఎమ్మెల్యేలు... ఫ్యాక్షనిజాన్ని ప్రోత్సహిస్తున్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. పోలీస్ స్టేషన్లను, ఎమ్మార్వో కార్యాలయాలను వైకాపా పార్టీ కార్యాలయాలుగా మార్చారన్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి దాడులు ఎన్నడూ జరగలేదని .. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత దాడులు, హత్యలు పెరిగిపోయాయన్నారు. పల్నాడులో జరుగుతున్న దాడులుపైన పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించి శాంతి భద్రతలను కాపాడాలన్నారు.

ఇదీ చదవండి:

అచ్చెన్న అరెస్టు ప్రభుత్వ దుర్మార్గ వైఖరికి నిదర్శనం: తెదేపా నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.