కరోనా కష్ట సమయంలో విశాఖ, గుంటూరు జిల్లాల్లో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం వేలానికి పెట్టిందని మాజీ మంత్రి దేవినేని ఉమా దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసమే జీవో 98ను విడుదల చేశారని ట్వీట్ చేశారు. తక్షణమే జీవోను రద్దు చేయాలని ధ్వజమెత్తారు.
గత నెల రోజులుగా వలస కార్మికులు రోడ్లు మీద నడుస్తూ ఆకలితో అలమటిస్తున్న విషయం అన్ని టీవీల్లో, పేపర్లలో చూస్తుంటే... సీఎస్ వ్యవహార శైలి ఇప్పుడే నిద్ర లేచినట్లుందని కేశినేని నాని ఎద్దేవా చేస్తూ ట్వీట్ చేశారు.
కరెంట్ ఛార్జీలు పెంచలేదు అనటం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణికి నిదర్శనమని తెదేపా అధికార ప్రతినిధి బొండా ఉమా ట్విట్టర్లో ధ్వజమెత్తారు. ఫిబ్రవరిలో 300 రూపాయల బిల్లు వస్తే... మార్చి, ఏప్రిల్ నెలల బిల్లు 3 వేల రూపాయలు ఎలా వచ్చిందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: 'చిన్న బడ్జెట్ స్కూళ్లకు సబ్సిడీ రుణాలు ఇచ్చి ఆదుకోండి'