ETV Bharat / state

నన్ను కాపాడటానికి మీరు చూపిన తాపత్రయం మర్చిపోలేను: బ్రహ్మారెడ్డి - macharla incident news

JULAKANTI BRAHMAREDDY : మాచర్లలో తెలుగుదేశం శ్రేణులు ఇక పైనా పట్టుదల కొనసాగించాలని.. పార్టీ ఇంచార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో కార్యకర్తలకు నేరుగా అందుబాటులో ఉండలేకపోతున్నానని.. ఏదైనా ఇబ్బంది ఉంటే రాష్ట్ర పార్టీకి తెలియజేయాలని సూచించారు.

JULAKANTI BRAHMAREDDY
JULAKANTI BRAHMAREDDY
author img

By

Published : Dec 19, 2022, 2:21 PM IST

నన్ను కాపాడటానికి మీరు చూపిన తాపత్రయం మర్చిపోలేను

JULAKANTI BRAHMAREDDY : మాచర్లలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు చూపించిన పట్టుదల, పౌరుషం ఇక పైనా కొనసాగించాలని పార్టీ ఇంఛార్జ్ జూలకంటి బ్రహ్మారెడ్డి సూచించారు. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలకు కాలమే సమాధానం చెబుతుందన్నారు. పోలీసులు పెట్టే కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. పల్నాడు గడ్డపై పుట్టిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో పోలీస్​స్టేషన్ చూసిన వాళ్లేనని వ్యాఖ్యానించారు.

మాచర్ల ఘటనలో టీడీపీ కార్యకర్తలు తనను కాపాడేందుకు చూపిన తాపత్రయం జీవితంలో మర్చిపోలేనన్నారు. ప్రత్యేక పరిస్థితుల్లో కార్యకర్తలకు నేరుగా అందుబాటులో ఉండలేకపోతున్నానని.. ఏదైనా ఇబ్బంది ఉంటే రాష్ట్ర పార్టీకి తెలియజేయాలని సూచించారు.

"మాచర్లలో టీడీపీ కార్యకర్తలు చూపించిన చొరవ, పౌరుషం కొనసాగించాలి. నన్ను కాపాడటానికి కార్యకర్తలు చూపిన తాపత్రయం మర్చిపోలేను. పార్టీ కార్యకర్తలు భయపడాల్సిన పనిలేదు. మనకు రాష్ట్ర నాయకత్వం అండగా ఉంటుంది. పల్నాడులో పుట్టినవాళ్లు స్టేషన్ గడప తొక్కకుండా ఎవరూ లేరు. ప్రత్యేక పరిస్థితుల వల్ల నేరుగా అందుబాటులో రాలేకపోతున్నా. మీకేమైనా ఇబ్బంది జరిగితే రాష్ట్ర నాయకత్వానికి చెప్పండి" - జూలకంటి బ్రహ్మారెడ్డి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.