కరోనా బాధితులు పెరుగుతున్న కారణంగా గుంటూరు జీజీహెచ్లో.. తాత్కాలిక ప్రాతిపదికన నర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్ల నియామకానికి యుద్ధ ప్రతిపాదికన చర్యలు చేపట్టారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రభావతి ఆధ్వర్యంలో.. అభ్యర్ధులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 300 మంది నర్సులకు గాను.. 175 మంది హాజరుకాగా అందరికీ బాధ్యతలు ఇచ్చారు.
డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా తాత్కాలికంగా నియమించారు. వీరితో సిబ్బంది కొరతే తీరే అవకాశం ఉందని ప్రభావతి తెలిపారు. మొదటి విడతలో తమను నియమించుకుని 6 నెలలకు బయటకు పంపించేశారని.. రెండో విడతలో అయినా శాశ్వతంగా కొనసాగించాలని ఒప్పంద నర్సులు కోరారు.
ఇదీ చదవండి:
త్వరలోనే కొవిడ్ కేంద్రాల్లోనూ ఆక్సిజన్ సౌకర్యం: మంత్రి ఆళ్ల నాని