గుంటూరు జిల్లా నిజాంపట్నం రొయ్యల రైతులు.. కొత్తగా చెరువు తయారు చేసుకోవడానికి దాదాపు 2 నెలలపాటు శ్రమించాల్సి వచ్చేది. విలువైన సమయం వృథా కావడమే కాకుండా.. ఖర్చు కూడా భారంగా మారేది. ఇది గమనించిన నాగార్జున విశ్వవిద్యాలయ యువ ఆచార్యుడు తౌసిఫ్ అహ్మద్.. చైన్ డ్రాగింగ్ బోట్‌ను (Chine dragging boat) రూపొందించారు. ఈ మినీ బోట్ ద్వారా.. ఒకే వ్యక్తి రోజుకు 5 నుంచి ఆరుసార్లు 20 చెరువుల్ని చదును చేయవచ్చంటున్నాడు.
ఈ బోటు నిర్మాణంలో 3.5 లీటర్ల సామర్థ్యమున్న జీఎక్స్-160 ఇంజిన్ ఉపయోగించిన తౌసిఫ్.. లీటర్ పెట్రోల్‌తో 3 గంటల పాటు పనిచేసేలా తీర్చిదిద్దాడు. చైన్ ర్యాగింగ్ బోటుకు పేటెంట్ కూడా సొంతం చేసుకున్న ఈ యంగ్ ప్రొఫెసర్... వ్యవసాయం, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా తోటి అధ్యాపకులు, విద్యార్థులతో కలిసి ప్రయోగాలు కొనసాగిస్తున్నాడు. అన్నదాతల సమస్యలు, సవాళ్ల పరిష్కారమే లక్ష్యంగా ఆవిష్కరణలు చేస్తున్న మహ్మద్ తౌసిఫ్ అహ్మద్.. అందరి అభినందనలు అందుకుంటున్నాడు.
ఇదీ చదవండి: