గుంటూరులోని సీపీఎం జిల్లా పార్టీ కార్యాలయంలో అమరావతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ రాసిన పుస్తకాలపైన సమావేశం నిర్వహించారు. జాతిపిత రచించిన హిందూ స్వరాజ్ పుస్తక పరిచయం, విశ్లేషణ, చర్చాకార్యక్రమాన్ని చేపట్టారు. మహాత్ముని ఆశయాల కు అనుగుణంగా.. ఆయన బాటలో యువత నడవాలని ఆశయంతో చర్చా వేదిక నిర్వహించినట్లు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ పేర్కొన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ ఆశయాలను, సిద్ధాంతాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాడనికి... ప్రతి నెల ఆయన రాసిన పుస్తకాలపైన చర్చావేదిక నిర్వహించాలని ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. ఇటువంటి కార్యక్రమాల వల్ల గాంధీజీ ఆశయాలను సామాన్య ప్రజలకు అర్థమయ్యేలా చేయడానికి కృషి చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: