ETV Bharat / state

అధికారుల తనిఖీల్లో భారీగా రేషన్ బియ్యం పట్టివేత

గుంటూరులో పౌరసరఫరాల అధికారులు అక్రమంగా తరలిస్తోన్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. ఓ వ్యక్తి పై కేసు నమోదు చేశారు.

author img

By

Published : Aug 30, 2019, 6:13 AM IST

రేషన్ బియ్యం పట్టివేత
అధికారుల తనిఖీల్లో రేషన్ బియ్యం పట్టివేత

గుంటూరులోని పోస్టల్ కాలనీలో గురువారం రాత్రి పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తోన్న 133 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఓ ఇంట్లో రేషన్ బియ్యం ఉన్నట్లు సమాచారం తెలుసుకుని తనిఖీలు చేపట్టారు. 266 సంచుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. కార్డుదారులు, వేర్వేరు ప్రాంతాల నుంచి కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచుకొని వాటిని ప్లాస్టిక్ సంచులలోకి మార్చి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి శివరాం ప్రసాద్, ఏఎస్ఓ బాషా బియ్యాన్ని పరిశీలించారు. బయట నివాసగృహంగా కనిపిస్తున్నా లోపల చిన్నపాటి గోదామును తలపించేలా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం బస్తాలు ఉండటం అధికారులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఓవ్యక్తిపై కేసు నమోదు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి.

​కోడెల కుమారుడి షోరూమ్​ అనుమతి రద్దు

Intro:ap_atp_56_29_collector_thanilee_av_ap10099
Date:29-08-2019
Center:penu konda
Contributor:c.a.naresh
Cell:9100020922
EMP ID:AP10099
మహాత్మా జ్యోతిభా పూలే పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్
అనంతపురం జిల్లా రొద్దం మండల కేంద్రంలోనీ మహాత్మా జ్యోతిభా పూలే పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గురువారం రాత్రి తనిఖీ చేశారు. పాఠశాలలోని మౌలిక సదుపాయాల పై అధికారులతో ఆరాతీశారు. పాఠశాలలో తాగునీటి సమస్య , పక్కా భవన నిర్మాణం పై స్పందించారు. పాఠశాలలలోని బోరుబావికి విద్యుత్ సౌకర్యం కల్పించాలని సంధిత అధికారుతో ఛరవాణిలో చర్చించారు. పక్కా భవన నిర్మాణం కోసం కేటాయించిన 4ఎకరాల స్థలానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం విద్యార్థులతో సమస్యల పైఅడిగి తెలుసుకున్నారు.. కార్యక్రమంలో పెనుకొండ ఆర్డీఓ ఏ.శ్రీనివాస్, రొద్దం తహసీల్దార్ హమీద్ బాష,ఎంపిడిఓ నసీమ, పాఠశాల హెచ్.ఎం.గోపాల్ తదితరులు పాల్గొన్నారు..Body:ap_atp_56_29_collector_thanilee_av_ap10099Conclusion:9100020922
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.