NRI Ram Chaudhary: ఇది గుంటూరు జిల్లా.. వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామం. ఈ ఊళ్లోనే, ఈ స్కూళ్లోనే.. ఓనమాలు దిద్దారు ఉప్పుటూరి రామ్ చౌదరి..! ఉద్యోగరీత్యా.. అమెరికాలో స్థిరపడ్డారు. తనకు విద్యాబుద్ధులు నేర్పిన బడి తనలాగే ఉన్నతంగా ఉండాలనుకున్నారు రామ్. పాఠశాల అభివృద్ధికి... దాదాపు 7 లక్షల వరకు సాయం చేశారు. బెంచీలు, సైకిళ్లు, కంప్యూటర్లు, ఆట వస్తువులు, పుస్తకాలు ఇలా ఒకటేంటి చివరకు ఉప కార వేతనాలూ అందిస్తున్నారు.
"వాళ్లు అడిగింది నేను ఇవ్వలేనని నేను ఎప్పుడు అనలేదు నా బిడ్డ.. వెంటనే అడిగింది చేసి పెట్టేస్తాడు.. మనం పడిన వేదన ఇంకేవ్వరు పడకూడదు..మన ఆర్థిక పరిస్థితి బాగుంది..లేనప్పుడు మనం జాగ్రత్త పడలేదా..అందుకనే పిల్లలని కాస్త చూద్దామనే లెక్కలో ఉంటాడు..అలాంటి బిడ్డను కన్నందుకు ఈ జన్నకు నాకు చాలా సంతోషంగా ఉంది.." రామ్ చౌదరి తల్లి
ఇది పుల్లడిగుంటలోని అంగన్‌వాడీ కేంద్రం. ఇందులో.. పిల్లలు హాయిగా ఆడుతూపాడుతూ చదుపుకుంటున్నారంటే అదంతా రామ్ చలవే. ఈ అంగన్వాడీ కేంద్రాన్ని పిల్లల నేస్తంలా మార్చడానికి.. అవసరమైన సామాగ్రినంతా సమకూర్చారు రామ్. ప్రస్తుతం ఇందులో.... 36 మంది పిల్లలున్నారు. ప్రభుత్వం దీన్ని జిల్లాలోనే ఉత్తమ అంగన్వాడీ కేంద్రంగా ప్రకటించి.. అవార్డు అందించింది.
"రామ్ చౌదరిగారు ఈ పాఠశాలలో చదువుకున్నారు.. జన్మనిచ్చిన తల్లిదండ్రులను, పుట్టిన గ్రామాన్ని మరవలేము.. అనే కాన్సెప్ట్‌తో పాఠశాలకు.. గ్రామానికి ఎన్నో విధాలుగా సహాయం చేస్తున్నారు.. చిన్నప్పుడు వారిని విహారయాత్రకు తీసుకుపోయే పరిస్థితి లేదు..కాబట్టి మిగతా పిల్లలు..భవిష్యత్తులో పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని.. ప్రతీ సంవత్సరం విహారయాత్రకు...అధికారుల సంప్రదింపులతో అమరావతి ..ఇతరాత్ర ప్రాంతాలను..చూపించాము..." హనుమంతురావు ప్రధానోపాధ్యాయుడు
గ్రామాభివృద్ధికీ తనవంతు సాయంచేస్తున్నారు రామ్ చౌదరి..! సీసీ రోడ్లకు 25 లక్షల విరాళం ఇచ్చారు. తాగునీటి అవసరాల కోసం.. వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. మహిళలకు కట్టుమిషన్లు అందించారు. స్వగ్రామానికేకాదు.. చుట్టుపక్కల గ్రామాల్లో దోమల నివారణకు ఫాగింగ్ యంత్రాలు, దోమతెరలు.. పంపిణీ చేశారు. ఇప్పటిదాకా 2 కోట్ల రూపాయలు సామాజిక సేవకు.. వెచ్చించారు.
వంటపాత్రలు కూడ సరిగ్గా లేవని.., అమ్మను అడిగితే.. అన్నీ కొనిచ్చారు.. కుక్కరు కొనిచ్చారు.. పిల్లలు చదువు ఇంకా బాగుండాలని చెప్పి ..ఆట వస్తువులు..పిల్లలు కూర్చోవడానికి కావలసిన బెంచీలు, ఇతర మెటీరియల్‌ను రామ్ చౌదరి అన్నయ్య కొనిచ్చారు..పిల్లలు బురద తొక్కుకుంటూ లోపలి రాకుండా ఉండటానికి రామ్ చౌదరి అన్నయ్య ఇసుక వేయించాడు..గత నెల క్రితం డిప్యూటి కలెక్టర్ విజిట్‌కి వచ్చినప్పుడు..ఇంత సామాగ్రి అంగనవాడీ కేంద్రంలో ఉందా అని ఆశ్చర్య పడ్డారు..సంతోషపడ్డారు... అంజనాదేవి అంగనవాడీ టీచర్
అమెరికాలోని తానా సహకారం కూడా తీసుకుంటున్నారు. 2 ఎకరాలలోపు ఉన్న చిన్న రైతుల పొలాలల్ని ట్రాక్టర్లతో ఉచితంగా దున్నిస్తున్నారు. రామ్ సేవాగుణాన్ని అంతా మెచ్చుకుంటుంటే ముచ్చటేస్తోందంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు.. దశాబ్దం క్రితమే అమెరికాలో స్థిరపడిన రామ్ చౌదరి స్ఫూర్తితో.. మరింతమంది జన్మభూమి రుణం తీర్చుకోవాలని గ్రామస్తులు అభిలషిస్తున్నారు.
ఇవీ చదవండి: