వైకాపా రైతు ప్రభుత్వం కాదు.. అన్నదాతలకు సంకెళ్లు వేసే ప్రభుత్వమని తెదేపా నరసరావుపేట పార్లమెంటరీ ఇన్ఛార్జ్ దాసరి ఉదయశ్రీ అన్నారు. నరసరావుపేట తెదేపా కార్యాలయంలో దీనికి రానున్న కాలంలో వైకాపా ప్రభుత్వం తప్పకుండా మూల్యం చెల్లించుకుంటుందన్నారు. నిత్యావసరాల ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. నిరసనకు దిగిన తెదేపా నాయకులను గృహానిర్బంధం చేయడాన్ని ఖండించిన ఆమె రైతులకు సంకెళ్లు వేయడంపై నిరసన తెలపడం ఏ విధమైన తప్పని ప్రశ్నించారు.
రాజధాని అమరావతి కోసం దీక్షలు చేస్తున్న రైతులపై ప్రభుత్వం అవలంభిస్తున్న తీరును నరసరావుపేట నియోజకవర్గ తెదేపా ఇన్చార్జ్ చదలవాడ అరవింద బాబు తప్పుబట్టారు. రైతుల రాజ్యంగా చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి జగన్.. అదే రైతులకు సంకెళ్లు వేయించి వారిని అవమానపరిచారన్నారు. రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమాలు పక్కన పెట్టి ఇసుక, భూదందాలు, మద్యం దందాలు చెసుకుంటున్నారని దుయ్యబట్టారు.
ఇవీ చూడండి...