తన పేరును బ్యాలెట్ పేపర్లో తప్పుగా ముద్రించారని ఎన్నికల కమిషన్కు... సీపీఎం జడ్పీటీసీ అభ్యర్థి పంతగాని నాగమల్లేశ్వరరావు ఫిర్యాదు చేశారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలానికి చెందిన నాగమల్లేశ్వరరావు... సీపీఎం తరుఫున పోటీ చేశారు. ఓటింగ్ రోజున ఉదయం ఏడున్నర గంటలకు పోలింగ్ కేంద్రానికి వెళ్లగా... అక్కడ బ్యాలెట్ పేపర్లో తనపేరు తప్పుగా ఉందని గుర్తించారు.
విషయంపై పోలింగ్ కేంద్రంలోని అధికారుల్ని అడగ్గా... తమకు తెలియదని సమాచారం ఇచ్చారు. రిటర్నింగ్ అధికారికి చెబుదామని వెళితే స్పందించలేదన్నారు. బ్యాలెట్ పేపర్లో నాగమల్లేశ్వరరావు బదులు నాగేశ్వరరావు అని ముద్రించగా... తన మద్దతుదారులు, అభిమానులు ఓటు వేయలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ జరిపి.. మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని నాగమల్లేశ్వరరావు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: