ETV Bharat / state

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే శ్రీదేవి - అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే శ్రీదేవి

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో వైద్య, విద్య రంగాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని నిర్ధేశించుకున్నట్లు ఎమ్మెల్యే శ్రీదేవి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా వాటి నిర్మాణాలు చేపట్టి అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి: ఎమ్మెల్యే శ్రీదేవి

author img

By

Published : Jun 15, 2020, 10:57 PM IST

గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి అధికారులను ఆదేశించారు. తన కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలోని అసిస్టెంట్ ఇంజనీర్లతో ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల వివరాలు అడిగి తెలుసుకున్నారు.

నియోజకవర్గంలో వైద్య, విద్య రంగాలను పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నట్టు శ్రీదేవి స్పష్టం చేశారు. అందుకు అనుగుణంగా వాటి నిర్మాణాలు కూడా ఉండాలన్నారు. గ్రామ సచివాలయాలు, ఇంకా అదనంగా నిర్మించాల్సినవి ఉంటే తక్షణమే సంబంధిత అధికారులతో మాట్లాడి పనులు మొదలుపెట్టాలన్నారు.

నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న పాఠశాలలు అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో నాసిరకమైన పనులు జరిగితే సహించేది లేదని... అందుకు పర్యవేక్షణ అధికారులే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పనులు పూర్తి నాణ్యతా ప్రమాణాలతో జరగాలని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.