ETV Bharat / state

oxygen plants: రాష్ట్రంలో ఆక్సిజన్‌ ప్లాంట్లను ప్రారంభించిన మంత్రులు

దేశవ్యాప్తంగా పీఎం కేర్స్ నిధులతో ఏర్పాటు చేసిన ఆక్సిజన్‌ ప్లాంట్ల(oxygen plants)ను వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో వివిధ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఆక్సిజన్ ప్లాంట్లను మంత్రులు ప్రారంభించారు.

author img

By

Published : Oct 7, 2021, 1:49 PM IST

sucharita , vellampalli
sucharita , vellampalli

దేశవ్యాప్తంగా ఆక్సిజన్ ప్లాంట్ల(oxygen plants)ను ప్రధాని నరేంద్ర మోదీ(pm modi) ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా విజయవాడ జీజీహెచ్​లో పీఎం కేర్స్ నిధులతో ఏర్పాటు చేసిన మూడు ఆక్సిజన్ ప్లాంట్లను మంత్రి వెల్లంపల్లి ప్రారంభించారు. గుంటూరు జీజీహెచ్​లో గంటకు వెయ్యి లీటర్ల ఉత్పత్తి సామర్ధ్యం కలిగిన రెండు ఆక్సిజన్ ప్లాంట్లను హోంమంత్రి సుచరిత ప్రారంభించారు. రెండు ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా జీజీహెచ్ లో శాశ్వతంగా ఆక్సిజన్ కొరత తీరుతుందన్నారు.మూడో విడత కరోనా వ్యాప్తిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదని.. అయినప్పటికీ ఎప్పుడు కరోనా వచ్చినా ఎదుర్కొనేందుకు రాష్ట్రప్రభుత్వం సిద్ధంగా ఉందని హోంమంత్రి సుచరిత భరోసా ఇచ్చారు.

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 1,224 ఆక్సిజన్ ప్లాంట్లకు పీఎం కేర్స్​ ఫండ్స్(pm cares fund news)​ ద్వారా నిధులు మంజూరు చేసినట్లు ప్రధాని మంత్రి కార్యాలయం పేర్కొంది. వీటిలో 1,100లకు పైగా ప్లాంట్లు రోజుకు 1,750 మెట్రిక్​ టన్నుల ఆక్సిజన్​ను ఉత్పత్తి చేస్తున్నాయని తెలిపింది. దేశంలో కరోనా విస్తరణ నేపథ్యంలో తలెత్తిన ఆక్సిజన్​ కొరతను నివారించే దిశగా కేంద్రం చర్యలు ప్రారంభించింది . అలాగే వైద్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో భాగంగా పీఎస్‌ఏ ఆక్సిజన్‌ ప్లాంట్లు ఏర్పాటును ముమ్మరం చేసింది.

ఇదీ చదవండి

దేశవ్యాప్తంగా 35 ఆక్సిజన్​ ప్లాంట్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.