ETV Bharat / state

తుమ్మల ఇంటికి హరీశ్​ రావు.. రాజకీయ వర్గాల్లో హాట్ ​టాపిక్

Minister Harish Rao Meets Thummala : ఖమ్మంలో బీఆర్ఎస్ బహిరంగ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చిన మంత్రి హరీశ్‌రావు, గండుగులపల్లిలోని మాజీ మంత్రి తుమ్మల ఇంటికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి అజయ్, ఎంపీలు నామ, రవిచంద్రతో కలిసి తుమ్మల ఇంటికి వెళ్లి అక్కడే భోజనం చేశారు. ఈ నెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు హాజరుకావాలని, తుమ్మలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిసింది.

Minister Harish Rao Meets Thummala
తుమ్మల ఇంటికి హరీశ్​ రావు.. రాజకీయ వర్గాల్లో హాట్ ​టాపిక్
author img

By

Published : Jan 12, 2023, 2:16 PM IST

Minister Harish Rao Meets Thummala : ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్​లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బహిరంగ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చిన మంత్రి హరీశ్‌రావు, దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మాజీమంత్రి తుమ్మల ఇంటికి వెళ్లి కలవడం.. రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి అజయ్, ఎంపీలు నామ, రవిచంద్రతో కలిసి తుమ్మల ఇంటికి వెళ్లిన హరీశ్‌రావు అక్కడే భోజనం చేశారు.

అనంతరం తుమ్మలతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఇరువురి మధ్య పలు కీలక రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చినట్లు తుమ్మలకు హరీశ్‌ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం వ్యవధిలో సీఎం కేసీఆర్ రెండు పర్యటనలు, ఈ నెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు హాజరుకావాలని, తుమ్మలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిసింది.

బహిరంగ సభ విజయవంతానికి పనిచేయాలని కోరినట్లు సమాచారం. కొత్తగూడెం, ఖమ్మం జిల్లా నూతన సమీకృత కలెక్టరేట్ల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కోరినట్లు తెలిసింది. జిల్లాలో కీలకనేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న సమయంలో తాజా పరిణామాలపైనా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రానున్న రోజుల్లో తుమ్మలకు సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీగా హరీశ్‌రావు తుమ్మలకు చెప్పినట్లు చర్చ జరుగుతోంది.

తుమ్మల ఇంటికి హరీశ్​ రావు.. రాజకీయ వర్గాల్లో హాట్ ​టాపిక్

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.