ETV Bharat / state

PPP పద్ధతిలో రోడ్ల నిర్మాణం - రెండు విడతల్లో 20 రహదారులకు మోక్షం - TOP PRIORITY TO NH IN KADAPA DIST

రాష్ట్ర రహదారులకు మోక్షం కల్పించే దిశగా చర్యలు

Several State Roads in Annamayya and YSR Districts Will Be Maintained As National Highways
Several State Roads in Annamayya and YSR Districts Will Be Maintained As National Highways (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 26, 2024, 1:52 PM IST

Several State Roads in Annamayya and YSR Districts Will Be Maintained As National Highways : ప్రజలకు అవగాహన కల్పించి రాష్ట్ర రహదారులకు మోక్షం కల్పించే బాధ్యత తీసుకుంటామని, ఇందుకు ఎమ్మెల్యేలు బాధ్యత వహించాలని సీఎం చంద్రబాబు అన్నారు. రహదారులను సుందరంగా తీర్చిదిద్దేవిధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని ప్రయాణికులపై పెద్దగా భారం లేకుండా చూసుకుంటామని వివరించాలని, ఇందుకు ప్రజలను ఒప్పించే బాధ్యత ఎమ్మెల్యేలు తీసుకోవాలని సీఎం సూచించారు.

ఇటీవల శాసనసభలో ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ప్రకటన చేశారు. ఎమ్మెల్యేలందరూ సానుకూలత వ్యక్తం చేయడంతో పాటు ప్రయోగాత్మకంగా అమలు చేసే జిల్లాల్లో తమ జిల్లాను చేర్చాలంటూ ముందుకొచ్చారు. ఈ మేరకు అంకురార్పణ జరగ్గా అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో పలు రహదారులకు చోటు దక్కింది.

అన్నమయ్య, వైఎస్‌ఆర్‌ జిల్లాల్లో పలు రాష్ట్ర రహదారుల ముఖచిత్రం మారిపోనుంది. జాతీయ రహదారుల తరహాలో నిర్వహణ జరగనుంది. రహదారులపై గుంతల్లేకుండా చూసుకోవడం, నిర్దేశిత సమయానికి బీటీ లేయర్‌ వేయడం, ఇరువైపులా ముళ్లకంపలు పెరిగిపోకుండా చూసుకోవడం తదితర చర్యలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో నిర్వహణకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ) కింద గుత్తేదారులకు రాష్ట్ర రహదారుల నిర్వహణ అప్పగింతకు జిల్లా స్థాయి నుంచి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు అందాయి. గడిచిన అయిదేళ్లలో రెండు జిల్లాల్లో రహదారులు గుంతలు పడ్డాయి. తట్టమట్టి వేసిన దాఖాలాల్లేవు.

ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే గుంతలు పూడ్చే కార్యక్రమం చేపట్టారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్‌ విధ్వంసకర పాలనతో రహదారులు అధ్వానంగా మారాయి. పీపీపీ పద్ధతి ప్రకారం రహదారుల నిర్వహణకు ప్రజలను ఒప్పించగలగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎమ్మెల్యేలను కోరారు. ఈ ప్రతిపాదన బాగుందంటూ ఎమ్మెల్యేలు చేతులెత్తి ఆమోదం తెలిపారు. రెండు విడతల్లో రెండు జిల్లాల్లో 11 రహదారులు పీపీపీ విధానం కిందకు వెళ్లనున్నాయి. మొదటి విడతలో 95 కిలోమీటర్ల రాజంపేట నుంచి గూడూరు, 43 కిలోమీటర్ల జమ్మలమడుగు నుంచి కొలిమిగుండ్ల రహదారులను ప్రతిపాదించారు.

పనుల్లో నాణ్యత లేకపోతే గుత్తేదారులను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టండి - సీఎం చంద్రబాబు ఆదేశం

రెండో విడతలో తొమ్మిదింటికి స్థానం : రెండో విడతలో అమలు చేసే దిశగా రెండు జిల్లాల్లో 9 కీలక రహదారులను గుర్తించారు. బెంగళూరు నగరంతో దుగ్గరాజపట్నం ఓడరేవును అనుసంధానం చేసే దిశగా కదిరి నుంచి రాజంపేట, గూడూరు రహదారిని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానం కింద అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ సంకల్పించింది. మైదుకూరు మీదుగా బద్వేలు రహదారి అభివృద్ధి జరుగుతుండగా కడప నుంచి బాకరాపేట నుంచి సిద్దవటం మీదుగా కడప నుంచి పోరుమామిళ్ల రహదారిని అభివృద్ధి చేయనున్నారు.

వెనుకబడిన ప్రాంతమైన కురబలకోట మండలం ముదివేడు నుంచి తంబళ్లపల్లె మీదుగా పెద్దముడియం కలిపేవిధంగా మరో రహదారిని ప్రతిపాదించారు. వీటన్నింటినీ గుత్తేదారుల చేతిలో పెట్టి టోల్‌ విధింపునకు చర్యలు తీసుకుంటారు. కార్లు నుంచి భారీ వాహనాల వరకూ కొంత మొత్తంలో టోల్‌ వసూలు చేసి కొత్త రహదారుల నిర్మాణం చేపట్టనున్నారు.

ప్రతిపాదనలు ఇలా
రహదారికిలోమీటర్లు
రాజంపేట - గూడూరు 95.0
జమ్మలమడుగు- కొలిమిగుండ్ల43.0
కడప- పోరుమామిళ్ల81.4
రాజంపేట- కదిరి126.9
మైదుకూరు- తాటిచెర్ల48.16
కడప-పులివెందుల60.04
పోరుమామిళ్ల- కాశినాయన50.8
రాజంపేట-దుగ్గరాజపట్నం42.0
ములకలచెరువు- కండ్లమడుగు41.31
ముదివీడు- పెద్దముడియం46.85
నిమ్మలనపల్లె- గాలివీడు52.71

గ్రామాల్లోనూ హైవే తరహా రోడ్లు - తొలి విడతలో 18రూట్లు ఎంపిక

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.