'నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలి' - గుంటూరు రైతు సంఘాల నేతల ఆందోళన
దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గుంటూరులోని శంకర్ విలాస్ కూడలిలో రైతు సంఘాల నేతలు నిరసన చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నూతన వ్యవసాయ చట్టాల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రైతు సంఘాల నేతలు నిరసన
కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న నిరంకుశ విధానాలను వ్యతిరేకిస్తూ గుంటూరులోని శంకర్ విలాస్ కూడలిలో రైతు సంఘాల నేతలు నిరసన ప్రదర్శన చేపట్టారు. దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా స్థానిక బీఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట బైఠాయించారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతులకు నష్టాన్ని కలిగించే నూతన వ్యవసాయ చట్టాలను తక్షణమే రద్దు చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: