కార్తికమాసం సందర్భంగా గుంటూరు జిల్లా పెదనందిపాడు షిరిడి సాయి మందిరంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. కోటి దీపార్చన నిర్వహించారు. పుట్ట మట్టితో శివలింగాలను తయారు చేసి భక్తులకు ఇచ్చి అభిషేకం చేయించారు. 15 కోట్ల ఒత్తులతో దాదాపు మూడు గంటలపాటు మహిళలు పెద్ద సంఖ్యలో దీపార్చన కార్యక్రమాన్ని జరిపారు. శివ కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైన కార్తిక మాసంలో కోటి దివ్య జ్యోతులను వెలిగించారు. శివలింగ ఆకారాన్ని తయారు చేసి.. చూట్టు ఒత్తులతో దీపారాధన చేశారు. గత మూడు సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కమిటీ నిర్వహకులు తెలిపారు.
ఇదీ చదవండి: