కార్తిక పౌర్ణమి సందర్భంగా ప్రకాశం జిల్లా చీరాల, దర్శిలలో ఆలయాలు శివ నామస్మరణతో మారు మ్రోగుతున్నాయి. తెల్లవారుజాము నుంచే మహిళలు సముద్ర తీరాల్లో పుణ్య స్నానాలు ఆచరించి... దీపాలు సముద్రంలో వదిలారు. ఆలయాల కమిటీవారు దేవదేవువి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా భారీ ఏర్పాట్లు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు తీరంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఇదీ చదవండి: