ETV Bharat / state

నూరు వసంతాల అక్షయపాత్ర.. విద్యార్థుల ఆనంద నిలయం - ఏపీ తాజా వార్తలు

Hundred years of Guntur Kamma Hostel: విద్యాలయాలు 100 ఏళ్లు పూర్తి చేసుకుని శత జయంతి జరుపుకోవడం చూసి ఉంటాం.. కానీ వసతి గృహం వందేళ్ల పూర్తి చేసుకోవడం అనేది చాలా అరుదు. గుంటూరులో ఓ అరుదైన వసతి గృహం వందేళ్లు పూర్తి చేసుకుని కొత్త రికార్డు సృష్టించింది. ఎందరో హేమాహేమీలు ఈ వసతి గృహంలోనే ఉండి ఆయా రంగాల్లో స్థిరపడ్డారు. ఆ సంస్థ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వసతి గృహంపై కథనం.

Guntur Kamma Hostel
Guntur Kamma Hostel
author img

By

Published : Apr 3, 2023, 2:26 PM IST

Hundred years of Guntur Kamma Hostel: గుంటూరులోని ఆరండల్​పేట 4/4లోని కమ్మ వసతి గృహం వందేళ్లు పూర్తి చేసుకుంది. ఇక్కడ ఉండి ఎంతోమంది ఉన్నత శిఖరాలను అధిరోహించారు. చలనచిత్రం రంగం నుంచి గుమ్మడి వెంకటేశ్వరరావు, యలవర్తి నాయుడమ్మ, గుండెజబ్బు నిపుణులు పిడికిటి లక్ష్మణరావు, రాజకీయాల నుంచి మోటూరు హనుమంతరావు, జీవీఎస్ ఆంజనేయులు, శాస్త్రవేత్త ఆలపాటి సత్యనారాయణ వంటి ఎందరో ప్రముఖులు ఇక్కడే వసతి పొందారు. రాష్ట్రంలో మరెక్కడా ఓ వసతి గృహం వందేళ్లు పూర్తి చేసుకోలేదు.

సత్రంగా మొదలై.. ఈ వసతి గృహం ఆవిర్భావానికి ఎంతో చరిత్ర ఉంది. 1910 ప్రాంతంలో వివిధ పనులపై గుంటూరు వచ్చేవారికి లాడ్జిల సదుపాయం ఉండేది కాదు. మాచర్ల సమీపంలోని ఓబులేశుని పల్లెకు చెందిన శాఖమూరి వెంకట సాంబయ్య కోర్టు పనిపై వచ్చి రాత్రికి బస చేయాల్సి వచ్చేది. ఒక్కోసారి వరండాలో నిద్రించాల్సి వచ్చేది. ఇంటికి వెళ్లి తాను అనుభవించిన బాధను సతీమణి లక్ష్మీదేవమ్మకు చెప్పారు. తర్వాత రోజే ఆమె గుంటూరు వచ్చి ఆరండల్ పేటలో 2 వేల 400 గజాల స్థలాన్ని కొని.. భవనాన్ని నిర్మించి.. దానికి కమ్మ సత్రం అనే పేరు పెట్టారు.

సత్రం కాస్త వసతి గృహంగా..
ఆనాడు గ్రామాల నుంచి గుంటూరు పట్టణానికి వచ్చే విద్యార్థులకు వసతి సదుపాయం దొరికేది కాదు. జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి, జంపాల వెంకటేశం(కొత్త రఘురామయ్య మావయ్య) తదితర ప్రముఖులు లక్ష్మీదేవమ్మ కుమార్తె రాధాబాయమ్మ, అల్లుడు, గుంటూరు డిప్యూటీ కలెక్టర్‌ చిరుమామిళ్ల లక్ష్మీనారాయణ ప్రసాద్‌లను ఒప్పించి 1923లో దానిని కమ్మ హాస్టల్‌గా నామకరణం చేశారు. ఇప్పటికీ కమ్మ హాస్టల్‌ భవనం రాధావిలాస్‌ పేరుతో ఉంది. చిరుమామిళ్ల లక్ష్మీనారాయణ ప్రసాద్‌ విగ్రహం నేటికీ ప్రాంగణంలో ఉంది.

సేవల మరింత విస్తరణ..
1923లో మరింత విస్తరించి సత్రం కాస్త వసతి గృహంగా మారిపోయింది. హాస్టల్ సదుపాయం చాలకపోవంతో జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి ఆధ్వర్యంలో పలువురు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు చందాలు వేసుకుని మొదటి అంతస్తును నిర్మించారు. దీనిని 1929లో అవిభక్త మద్రాసు రాష్ట్ర ముఖ్యమంత్రి బొల్లినేని ముద్దుస్వామి నాయుడు ప్రారంభించారు. 1938లో కాటూరి అక్కయ్య సహకారంతో విద్యుత్తు సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 1959లో కమ్మ హాస్టల్​కు చెందిన భూములను అమ్మి రెండో భవనాన్ని కొన్నారు. కోర్టుకు వెళ్లి వివాదాన్ని పరిష్కరించుకున్న 1964లో జంపాల సాంబయ్య పేరును మార్చారు.

400 మంది విద్యార్థులు నివాసం.. 1972 నుంచి.. అంటే 51 సంవత్సరాల నుంచి డాక్టర్ కొండబోలు బసవ పున్నయ్య అధ్యక్షులుగా ఉన్నారు. ప్రస్తుతం 90 గదుల్లో 400 మంది విద్యార్థులు నివాసముంటున్నారు. ప్రస్తుతం కార్యదర్శిగా మందలపు బంగారుబాబు సేవలు అందిస్తున్నారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన వసతి గృహంలో చదువుకోవడం గర్వంగా ఉందంటున్నారు పూర్వ, ప్రస్తుత విద్యార్థులు. ఎక్కడో గ్రామీణ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుకుంటున్నామని, తమకు ఈ వసతి గృహంలో ఉండి చదువుకోవడం గర్వంగా ఉందని భావిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు వసతిని సమకూర్చడంలో వందేళ్లు పూర్తి చేసుకున్న ఈ వసతి గృహం మరింత ముందుకు సాగాలని కోరుకుందాం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.