గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 535 పాజిటివ్ కేసులు, అయిదు మరణాలు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 54,848కి చేరింది. వైరస్ నుంచి 46,466 మంది కోలుకున్నారు. జిల్లాలో మొత్తం మరణాల సంఖ్య 519కి ఎగబాకింది. చేరింది. రాష్ట్రంలో అత్యధిక మరణాలు నమోదైన జిల్లాల్లో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది.
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 86 మందికి కరోనా సోకినట్లు నిర్థరణ అయింది. మండలాల వారీగా చూస్తే... తెనాలిలో 61, నరసరావుపేటలో 42, తాడికొండలో 34, రేపల్లెలో 35, పెదకాకానిలో 23, పొన్నూరులో 23, శావల్యపురంలో 18, సత్తెనపల్లిలో 18, నాదెండ్లలో 21, మంగళగిరిలో 14, బాపట్లలో 13, తాడేపల్లిలో 12, దాచేపల్లిలో 12, చుండూరులో 11, తుళ్లూరులో 10, నకరికల్లులో 10 చొప్పున కేసులు నమోదయ్యాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి:
ఇదీ చదవండి: