గుంటూరులో యువతి దారుణ హత్య ఘటనపై.. రాష్ట్ర హోంమంత్రి మేకతోటి సుచరిత స్పందించారు. జీజీహెచ్‌కు వెళ్లి రమ్య కుటుంబాన్ని పరామర్శించారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. ఈ ఘటనలో పోలీసులు ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించారన్న హోంమంత్రి.. సాధ్యమైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటామని వెల్లడించారు.
కేసు విచారణను త్వరగా పూర్తి చేసి హంతకుడికి శిక్ష పడేలా చూస్తామన్నారు. దారుణ హత్యకు గురైన రమ్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని హోంమంత్రి సుచరిత పేర్కొన్నారు. రమ్య ఫోన్ లాక్ ఓపెన్ చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
అనుబంధ కథనం:
Murder: గుంటూరులో బీటెక్ విద్యార్థిని దారుణ హత్య.. కత్తితో పొడిచిన దుండగుడు