ETV Bharat / state

వైరస్​ కాంటాక్టుల గుర్తింపునకు ప్రత్యేక బృందాలు - గుంటూరు జిల్లా వార్తలు

గుంటూరులో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో కాంటాక్ట్ ట్రేసింగ్‌కు సంబంధిత సచివాలయం పరిధిలోనే ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు కలెక్టర్‌, గుంటూరు నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు.

guntur collector review
guntur collector review
author img

By

Published : Jul 9, 2020, 9:15 AM IST

పాజిటివ్‌ వ్యక్తుల కాంటాక్టులను గుర్తింపును వేగవంతం చేసేందుకు సచివాలయ స్థాయిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్‌, నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారి ఐ.శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లోని శంకరన్‌ హాలులో నగరపాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయాల నోడల్‌ అధికారులతో సమావేశమయ్యారు. అన్‌లాక్‌-2 నుంచి నగరంలో పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయని.. ఈ క్రమంలో పాజిటివ్‌ వ్యక్తుల ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించేందుకు వార్డు సచివాలయ పరిధిలో ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు, మహిళా పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు.

సచివాలయాల్లోని బృందాలన్నీ ఎంఎస్‌ఎస్‌ యాప్‌తో అనుసంధానిస్తున్నామని.. పాజిటివ్‌ కేసు వచ్చిన వెంటనే సంబంధిత సచివాలయ బృందాలకు సమాచారం అందుతుందన్నారు. వారు ఆయా కేసుకు సంబంధించిన వివరాలు యాప్‌లో నమోదు చేయాలన్నారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్తగా 1062 కరోనా కేసులు నమోదు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.