కరోనా అనుమానిత లక్షణాలతో ఐసోలేషన్ కేంద్రంలో చేరిన గుంటూరుకు చెందిన ప్రజాప్రతినిధి, అతని కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల ప్రజాప్రతినిధి సమీప బంధువు దిల్లీ వెళ్లి కరోనా బారిన పడ్డారు. అతనితో పాటు అతని సమీప బంధువు, అతనితో కలిసి సంచరించిన మరో ఇద్దరికి పాజిటివ్ రావటంతో అంతా ఆందోళనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధి రెండురోజుల పాటు హోం ఐసోలేషన్లో ఉన్నారు. అనంతరం అన్ని వర్గాల నుంచి ఒత్తిడితో రావటంతో ముందస్తు జాగ్రత్త చర్యగా కాటూరి వైద్యకళాశాల ఆస్పత్రి ఐసోలేషన్ కేంద్రంలో చేరగా... పరీక్షలు నిర్వహించారు. చివరకు నెగెటివ్ రావటంతో ప్రజాప్రతినిధితో పాటు బంధువులు, అనుచరులు ఉపశమనం పొందారు.
ఆ ప్రజాప్రతినిధికి కరోనా నెగిటివ్ - Corona Negative Cases in Guntur
కరోనా అనుమానిత లక్షణాలతో ఐసోలేషన్ కేంద్రంలో చేరిన గుంటూరుకు చెందిన ప్రజాప్రతినిధి, అతని కుటుంబ సభ్యులకు ఉపశమనం లభించింది. ప్రజాప్రతినిధితోపాటు కుటుంబ సభ్యులు, సహచరుల నమూనాలను పరీక్షలకు పంపగా నెగిటివ్గా నిర్ధారణ అయ్యాయి.