ETV Bharat / state

నేటి కోవిడ్​ మరణాల్లో గుంటూరు రెండో స్థానం - గుంటూరు జిల్లాలో కోవిడ్ కేసులు

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలో కొత్తగా 648 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు నమోదైన జిల్లాలో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

corona cases increasing at guntur district
గుంటూరు జిల్లాలో కరోనా
author img

By

Published : Sep 23, 2020, 9:12 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసుల ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో జిల్లాలో కొత్తగా 648 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో జిల్లావ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 52 వేల 836కి చేరింది. ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకుని 44 వేల 273 మంది ఇంటికి చేరుకున్నారు. తాజాగా వైరస్ ప్రభావంతో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 503కి చేరింది. రాష్ట్రంలోనే అత్యధిక మరణాలు నమోదైన జిల్లాలో గుంటూరు జిల్లా రెండో స్థానంలో నిలిచింది.

కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 143 కేసులు నమోదయ్యాయి. ఇక మండలాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. నరసరావుపేట-88, మంగళగిరి-38, తాడేపల్లి-38, కొల్లూరు-34, సత్తెనపల్లి-22, తెనాలి-22, మాచవరం-18, వినుకొండ-18, పిడుగురాళ్ల-17, బాపట్ల-16, వట్టిచెరుకూరు-16, చిలకలూరిపేట-13, ప్రత్తిపాడు-12, మేడికొండూరు-11, నాదెండ్ల-11, యడ్లపాడు-10 చొప్పున కేసులు ఉన్నాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.

ఇదీ చూడండి. 'వాసుపల్లి గణేష్ తల్లిలాంటి తెదేపాకి అన్యాయం చేశారు'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.