గుంటూరు జిల్లాకు కరోనా కేసుల తాకిడి కొనసాగుతోంది. శనివారం కొత్తగా 155 కరోనా కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరు నగరంలోనే 49 ఉన్నాయి. అందులో తెలంగాణ నుంచి వచ్చిన ముగ్గురికి వైరస్ సోకినట్టు తేలగా... క్వారంటైన్లో ఉన్న ఐదుగురికి పాజిటివ్ గా నిర్థారణ అయినట్లు అధికారులు వివరించారు. నేటితో జిల్లాలో పాజిటివ్ కేసుల మొత్తం 3571కి పెరిగింది.
ఇవాళ.. మంగళగిరిలో ఏకంగా 43, నరసారావుపేటలో 21, తాడేపల్లిలో 10 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సత్తెనపల్లిలో 4, ప్రత్తిపాడులో 3, తాడికొండలో 3 కేసులు చొప్పున నమోదు కాగా.. కారంపూడి, నకరికల్లు, పిడుగురాళ్ల, రాజుపాలెంలో రెండేసి కేసులు నమోదయ్యాయి. గుంటూరు గ్రామీణ మండలం, అమరావతి, తెనాలి, తుళ్లూరు, వినుకొండ, శావల్యపురం, దాచేపల్లి, దుగ్గిరాల, గురజాల, ఈపూరు, క్రోసూరు, ముప్పాళ్ల, మాచర్ల, రొంపిచర్లలో ఒక్కో కేసు చొప్పున నమోదైనట్లు జిల్లా వైద్యారోగ్య శాఖ నివేదికలో వెల్లడించారు.
జిల్లాలో ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకుని 1,398 మంది ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జ్ అయ్యారని వైద్యులు తెలిపారు. కరోనా కారణంగా జిల్లాలో మరణించిన వారి సంఖ్య 29కి చేరింది. కేసుల తాకిడి పెరగటంతో జిల్లాలో మరో 23 కొత్త కంటైన్మెంట్ జోన్లను ఏర్పాటు చేస్తూ జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ఆదేశాలు జారీచేశారు.
ఇదీ చూడండి: