ETV Bharat / state

విజృంభిస్తున్న మహమ్మారి.. కొత్తగా 762 కేసులు

author img

By

Published : Aug 12, 2020, 9:13 PM IST

గుంటూరు జిల్లాలో కరోనా కేసులు విజృంభిస్తూనే ఉన్నాయి. ఇవాళ కొత్తగా 762 కరోనా కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 25,437 కు చేరుకుంది. జిల్లాలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో హోం మంత్రి మేకతోటి సుచరిత, గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు సమీక్ష నిర్వహించారు.

corona case updates in guntur district
గుంటూరులో కరోనా కేసులు

గుంటూరు జిల్లాలో ఇవాళ కొత్తగా 762 కరోనా కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కేసుల సంఖ్య 25 వేల 437 చేరుకుంది. కొత్తగా నమోదైన కేసుల్లో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోనే 245 ఉన్నాయి. మంగళగిరిలో 51, నర్సరావుపేట 47, మాచర్ల 47, సత్తెనపల్లి 40, ఫిరంగిపురం 26, తెనాలి 25, పొన్నూరు 24, బాపట్ల 19, పిడుగురాళ్ల 18, పెదకూరపాడు 17, ముప్పాళ్ల 15, నాదెండ్ల 15, కొల్లిపొర 13, వినుకొండ 13, అచ్చంపేట 11, ఎడ్లపాడులో 10 కేసులు నమోదయ్యాయి. మిగతా ప్రాంతాల్లో 139 కేసులు వచ్చాయని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

కరోనా కారణంగా బుధవారం ఒక్కరోజే 13 మంది మరణించారు. దీంతో ఇప్పటి వరకూ జిల్లాలో మరణించిన వారి సంఖ్య 255 కు చేరుకుంది. కరోనా నుంచి జిల్లాలో 15వేల 759 మంది కోలుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో కరోనా నివారణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులతో హోంశాఖమంత్రి మేకతోటి సుచరిత, గుంటూరు జిల్లా ఇంఛార్జ్ మంత్రి చెరుకువాడ రంగనాథరాజు సమీక్ష నిర్వహించారు.

కోవిడ్ రోగులకు చికిత్స అందించే క్రమంలో చాలామంది వైద్యులు, సిబ్బంది వైరస్ భారిన పడ్డారని రంగనాథరాజు తెలిపారు. జిల్లాలో ప్రస్తుతం 7వేల 125 యాక్టివ్ కేసులు ఉండగా.. అందులో 3వేల 500 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వివరించారు. కరోనా రోగులకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే క్రమంలో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులకు 960 వెంటిలేటర్లు మంజూరు చేసినట్లు హోం మంత్రి సుచరిత వెల్లడించారు. త్వరలోనే అవి ఆయా ఆసుపత్రులకు చేరతాయన్నారు. కోవిడ్ మరణాలు తగ్గించే క్రమంలో ప్లాస్మా థెరపీని అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

24 గంటలు.. 9,597 కేసులు.. 93 మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.