FACE BASED ATTENDANCE APP EXEMPTION: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత యాప్ వినియోగంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో.. దాని నుంచి కొన్ని విభాగాలకు మినహాయింపు నిచ్చింది. (AP CFSS)ఏపీ సీఎఫ్ఎస్ఎస్ రూపొందించిన ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్ యాప్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకూ.. సొంతంగా రూపొందించుకున్న యాప్ ద్వారానే కొన్ని శాఖలు హాజరు నమోదు చేయాలని సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు జారీ చేసింది.
వైద్యారోగ్యం, కుటుంబ సంక్షేమశాఖలోని వివిధ విభాగాలు పాఠశాల విద్యాశాఖ, పంచాయతీరాజ్‌లోని గ్రామ సచివాలయ ఉద్యోగులు, పురపాలకశాఖలు సొంతయాప్ ద్వారానే ప్రస్తుతానికి హాజరు నమోదు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ విభాగాలు సొంత యాప్ ద్వారానే హాజరు నమోదు చేయాలని సూచించింది.
ఉద్యోగుల హాజరు నమోదును పర్యవేక్షించేందుకు ప్రభుత్వం రాష్ట్రస్థాయి డ్యాష్‌బోర్డును అమల్లోకి తెచ్చింది. యాప్ ద్వారా ఉద్యోగులు వేసే హాజరు డ్యాష్‌బోర్డుకు చేరుతుంది. వీటిని అయా విభాగాధిపతులు పరిశీలిస్తారు. విభాగాధిపతులు, అధికారులకు డ్యాష్‌బోర్డులో తనిఖీలకు అనుమతి కల్పిస్తూ ఆదేశాలు జారీచేసింది. సిబ్బంది హాజరు పరిశీలనకు దీన్ని వినియోగించాలని సూచించింది.
ఇవీ చదవండి: