ETV Bharat / state

రాష్ట్రానికి కేంద్ర ఎన్నికల బృందం - ఓటర్ల జాబితాలోని అక్రమాల పరిశీలనకు - ఏపీ తాజా

Central Election Team visit AP On the 21st of December: అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాలు, ఓట్ల తొలగింపులు, గంపగుత్తగా ఓటర్ల నమోదు వ్యవహారాలపై ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి రానుంది. ఈ నెల 21 తేదీన ఏపీకి రానున్న కేంద్ర బృందం 22,23 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించనుంది. ఫాం 7 దరఖాస్తులు, జీరో డోర్ నెంబర్లలో వందలాది ఓట్లు, ఓటర్ల జాబితాలో వాలంటీర్ల జోక్యం తదితర ఫిర్యాదులపై ఈసీ బృందాలు పరిశీలన చేయనున్నాయి.

Central Election Team visit AP On the 21st of December

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 8:58 PM IST

Central Election Team visit AP On the 21st of December: రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అవకతవకలు, అక్రమాలపై క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి చెందిన ప్రత్యేక అధికారుల బృందం ఏపీలో పర్యటించనుంది. ఈ నెల 21 తేదీన ఏపీకి రానున్న కేంద్ర బృందం 22,23 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించనుంది. గంపగుత్తగా ఫాం 7 దరఖాస్తులు, జీరో డోర్ నెంబర్లలో వందలాది ఓట్లు, ఓటర్లజాబితాలో వాలంటీర్ల జోక్యం తదితర ఫిర్యాదులపై ఈసీ బృందాలు పరిశీలన చేయనున్నాయి.

కొత్తపేటలో ఓట్లు తొలగించడానికి మరో ఎత్తుగడ - స్థానికంగా లేరంటా 4 వేల మందికి పైగా నోటీసులు

అస్తవ్యస్తంగా ఉన్న ఓటర్ల జాబితాలు, ఓట్ల తొలగింపులు, గంపగుత్తగా ఓటర్ల నమోదు వ్యవహారాలపై ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేందుకు కేంద్ర ఎన్నికల బృందం రాష్ట్రానికి రానుంది. కేంద్ర ఎన్నికల సంఘంలోని కీలకమైన అధికారుల బృందం రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించి జిల్లా కలెక్టర్లు, రాజకీయ పక్షాలతోనూ భేటీ కానుంది. ఈ నెల 21 తేదీన రాష్ట్రానికి రానున్న ఈసీ అధికారులు డిసెంబరు 22, 23 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించనున్నారు.

కేంద్ర ఎన్నికల అధికారుల బృందాల పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లకూ సమాచారం పంపించారు. గంపగుత్తగా ఫాం 7 ల దాఖలు, జీరో డోర్ నెంబర్లలో వందలాది ఓటర్లు తదితర అంశాలపై ప్రతిపక్షాలు ఇప్పటికే పలుమార్లు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాయి. దీనిపై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఉన్నతాధికారులతో కూడిన బృందాన్ని ఏపీకి పంపుతోంది. ఈ బృందం రెండుగా విడిపోయి రాష్ట్రంలోని వేర్వేరు చోట్ల క్షేత్రస్థాయిలో పర్యటించి పరీశీలన చేయనుంది. ఓటర్ల జాబితాల రూపకల్పనలో వాలంటీర్ల జోక్యం, అధికార పార్టీ నేతలు, కొన్ని చోట్ల పోలీసులు కూడా జోక్యం చేసుకుంటున్న ఉదంతాల నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

ఓట్ల వేటలో అరాచకీయం! మనకు అనుకూలంగా లేకుంటే లేపేయ్ - ఉన్నతాధికారులకు వైసీపీ నేతల హుకుం?

ఇప్పటికే ఓ దఫా కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్రంలో పర్యటించింది. వివిధ అంశాలపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి సూచనలు జారీ చేసింది. మరోవైపు రాష్ట్రంలోని ఓటర్ల జాబితాల అక్రమాలపై మరోమారు ప్రతిపక్షనేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేయనున్నారు. నిర్దిష్టంగా జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలకు సంబంధించిన వివరాలను కూడా చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి అందించనున్నట్టు తెలుస్తోంది.

గతంలో టీడీపీ చేసిన ఫిర్యాదు మేరకు ముగ్గురు పోలీసు అధికారులను ఈసీ సస్పెండ్ చేసింది. కొందరు జిల్లా కలెక్టర్లు కూడా పక్షపాతంగా వ్యవహరిస్తున్నట్టు టీడీపీ బృందం ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేసింది. ఇదే అంశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా చంద్రబాబు తీసుకెళ్లనున్నట్టు సమాచారం.

రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో అవకతవకలు - చర్యలు తీసుకోవలని ప్రతిపక్షాల డిమాండ్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.