ETV Bharat / state

'వెయ్యి కోట్లు ఇస్తామని.. వంద కోట్లే ఇచ్చి బ్రాహ్మణులను అవమానించారు'

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మాట తప్పారని భాజపా నేత కృష్ణచైతన్య ఆరోపించారు. ఇస్తామన్న నిధులు ఇవ్వకపోవటం బ్రాహ్మణులను తీవ్రంగా అవమానించటమే అని అన్నారు.

bjp leaders krishna chaitnya comments on cm jagan
భాజపా నేత కృష్ణచైతన్య
author img

By

Published : Jul 17, 2020, 11:03 PM IST

బ్రాహ్మణ కార్పొరేషన్​కు వెయ్యి కోట్లు కేటాయించి పేద బ్రాహ్మణుల అభివృద్ధికి కృషి చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి బడ్జెట్​లో కేవలం 100 కోట్ల రూపాయలతో సరిపెట్టారని భాజపా ధార్మిక సెల్ రాష్ట్ర కన్వీనర్ కృష్ణచైతన్య ధ్వజమెత్తారు. బడ్జెట్​లో సైతం బ్రాహ్మణ సామాజిక వర్గం గురించి అసలు ప్రస్తావించలేదన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్​కి చైర్మన్, పథకాలు ఉన్నా..నిధులే లేవని ఆవేదన వ్యక్తం చేశారు. వెయ్యి కోట్లు ఇస్తామని.. వంద కోట్లు ఇవ్వడం బ్రాహ్మణులని తీవ్రంగా అవమానించడమే అన్నారు. భాజపా పోరాడగా మూడు నెలల ఫించన్ ఇచ్చారన్నారు. బ్రాహ్మణులకు అండగా ఉంటామని మోసం చేసిన ప్రభుత్వానికి నిరసనగా ఆదివారం భిక్షాటన కార్యక్రమం చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: బాపట్లలో అంబేడ్కర్ విగ్రహం తరలింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.