సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా జరిగే బతుకమ్మ సంబరాలు గుంటూరు జిల్లా పల్నాడులోని పలు పల్లెలతో పాటు మాచర్ల మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఆడపడుచులు ఏటా ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అన్ని ప్రాంతాల మహిళలు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా ఇక్కడ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. అటు తెలంగాణ.. ఇటు ఆంధ్రా సంప్రదాయాలను మేళవించి పల్నాడులోని మహిళలు జరిపే ఈ బతుకమ్మ సంబరాలు ఆధ్యాత్మికత తోపాటు ఐక్యతకు దోహదపడతాయని మహిళలు పేర్కొంటున్నారు.
ఇదీ చదవండీ.. గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేతపై హైకోర్టు స్టే