కరోనా కేసుల బారిన పడకుండా ఉండేందుకు పట్టణ పోలీసులు వినూత్న ఆలోచన చేశారు. సీఐ సాంబశివరావు సిబ్బంది కలిసి ప్రతి గ్రామానికి వెళ్లి కరోనా పై అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంలో కొవిడ్ కేసులు ఎక్కువగా ఉండటంతో అత్యవసరం అయితే తప్ప ఎవరూ పట్టణానికి రావద్దని తెలిపారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి ఎవరైనా వస్తే వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు.
గుంటూరు జిల్లా తీర ప్రాంతాల్లో కొవిడ్ కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలీసులు అన్నీ గ్రామాలకు వెళ్లి కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. పట్టణంలో పూర్త లాక్ డౌన్ అమలులో ఉందని ప్రజలెవ్వరూ బయటకు రావద్దని తెలిపారు.
ఇదీ చూడండి