ఏపీ విట్ విశ్వవిద్యాలయం బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంటెల్, బోస్టన్ సంస్థలతో విద్యా, ఐవోటీ, ఐఏ, పరిశోధనలపై ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పంద పత్రాలపై విట్ వర్శిటీ ఉపకులపతి కోటారెడ్డి సంతకాలు చేశారు. ఇంటెల్ ఇండియా సంచాలకులు జితేంద్ర చద్దా, బోస్టన్ ఐటీ సొల్యూషన్ ప్రతినిధి లక్ష్మీ నాగేశ్వరీ ఆన్ లైన్ ద్వారా సంతకాలు చేశారు.
ఈ ఒప్పందాల ద్వారా విద్యార్థులకు ఐవోటీ, సమాచార మార్పిడి నెట్‌వర్క్ సృష్టించడానికి ఉపయోగపడుతోందని ఉపకులపతి కోటారెడ్డి తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమ-విద్యార్థుల మధ్య అంతరాలను తగ్గించేలా ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: