5 percent EWS quota for Kapus: ఈడబ్ల్యూఎస్ కోటాలో కాపులకు 5 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని కోరుతూ మాజీ మంత్రి హరిరామ జోగయ్య వేసిన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పిటిషనర్ తరపు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలు వినిపిస్తూ రాయలసీమలో బలిజలు 15 లక్షలమంది ఉన్నారని కోర్టుకు తెలిపారు. రిజర్వేషన్లు బలిజలకు వస్తే వారు ఆర్ధికంగా, సామాజికంగా బలపడతారని ముఖ్యమంత్రి భావన అని తెలిపారు. అందుకే ప్రభుత్వం జీవో ఎమ్మెస్ నెంబర్ 60, 66 లను తీసుకువచ్చారని తెలిపారు. అవి చెల్లుబాటు కావని కోర్టులో వాదించారు. కాపులకు ఈబీసీ కోటా కింద ఇచ్చే రిజర్వేషన్లు అడ్డుకునే జీవో ఎమ్మెస్ 60, 66 లను వెనెక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు.
చంద్రబాబు సర్కార్ ఉన్న సమయంలో రూపొందించిన చట్టం 14, 15లను పునరుద్దరించి ఈ విద్యా సంవత్సరం నుండి కాపు, ఒంటరి, బలిజ, తెలగలకు రిజర్వేష్లను కల్పించాలని పిటిషన్లో విజ్జప్తి చేశారు. ఈ అంశంపై ఇప్పటికే పిల్లు పెండింగ్‌లో ఉన్నాయని ప్రభుత్వం తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. పిటిషన్‌ను డివిజన్ బెంచ్‌కు పంపాలని ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనికి పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టు 103 రాజ్యాంగ సవరణ కింద ఈ రిజర్వేషన్లు చట్టంగా తెచ్చారని పిటిషనర్ న్యాయవాది వాదించారు. వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం.. విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది. వచ్చే వాయిదా నాటికి కౌంటర్ వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని న్యాయమూర్తి ఆదేశించారు.
ఇవీ చదవండి: