AIMS Mangalagiri: కరోనాను కట్టడి చేయడంలో మన రాష్ట్రం దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ నివాస్ చెప్పారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఐదవ వార్షికోత్సవానికి నివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎయిమ్స్ అధికారులు ఆశించినట్లు రాష్ట్ర ప్రభుత్వం 100 శాతం సహకారమిస్తోందన్నారు. తాగునీటికి పైపు లైన్ నిర్మాణం, అటవీ భూమి డీ నోటిఫై చేయడం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. ఆరోగ్య శ్రీ ద్వారా ఏయిమ్స్ లో సేవలందించడం ద్వారా రోగుల సంఖ్య పెరిగిందన్నారు. రోగులకు మందులు ఇవ్వడమే కాకుండా వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. ఎయిమ్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తోందని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
"వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్‌గా నేను బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఎయిమ్స్‌లో రెండు ముఖ్యమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. దీనికి సంబంధించిన ఘనత అంతా డాక్టర్ ముఖేష్‌కు చెందుతుంది. అభివృద్ధి కార్యక్రమాల్లో మొదటిరి ఎయిమ్స్‌కు నీటి సరఫరాకు పైప్‌లైన్ సదుపాయం కల్పించడం." - నివాస్, వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్
ఇవీ చదవండి