BJP Leaders Complaint To DGP On TTD Parakamani Scam : తిరుమల వెంకటేశ్వరస్వామి పరకామణి డబ్బు దోచినవారిని వదిలిపెట్టబోమని TTD పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. పరకామణిలో విదేశీ డాలర్లు దోచినవారిపై చర్యలు తీసుకోవాలని DGPకి ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఘటనపై TTD ఈవో శ్యామలరావు విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. పరకామణి దోపిడీలో YSRCP పెద్దల పాత్ర ఉందని భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. పరకామణిలో సుమారు 100 కోట్ల రూపాయలు దోపిడీకి గురైనట్లు ఆయన తెలిపారు. ఇవన్నీ రహస్య అర అమర్చి తరలించారని తెలిపారు. తరలించిన మొత్తాన్ని వెనక్కి రప్పించాలని డీజీపీని కోరినట్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను భానుప్రకాశ్‌రెడ్డి మీడియా సమావేశంలో వివరించారు.
వైఎస్సార్సీపీ హయాంలో శ్రీవారి పరకామణిలో రూ.100 కోట్ల కుంభకోణం జరిగిందని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. హుండీ నుంచి నగదు దొంగిలిస్తూ 2023 ఏప్రిల్ లోనే రవికుమార్ పట్టుబడ్డారని ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణ కూడా చేశారన్నారు. అయితే కొందరు ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనే పోలీసులు నిందితుడ్ని వదిలేశారని ఆక్షేపించారు. పరకామణిలో అక్రమాలపై విచారణ చేసి నిగ్గుతేల్చాలని డిమాండ్ చేశారు.
మధ్యాహ్నానికే ఖాళీ- శ్రీవాణి దర్శన టికెట్లకు భారీ డిమాండ్
విదేశీ డాలర్లు మాయం : భక్తులు ఇచ్చే దానాలు అన్ని స్వామి వారి కార్పస్ నిధికి వెళ్తుందన్నారు. కానీ రవికుమార్ అనే వ్యక్తి పరకామని నుంచి విదేశీ డాలర్లు మాయం చేశాడని భానుప్రకాశ్‌రెడ్డి ఆరోపించారు. తర్వాత ఆ కేసు ఏమైందో కూడా తెలియదన్నారు. గత ప్రభుత్వ హయంలో అలాంటి వ్యక్తులను కాపాడేలా కొందరు వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఈ వ్యవహారంలో ట్రిపుల్ Rలు ఉన్నారన్నారు. త్వరలోనే పాత్రధారులు, సూత్ర ధారుల వివరాలు బయట పెడతా అని స్పష్టం చేశారు. దొంగతనం కేసులో పోలీసు అధికారి ఒత్తిడితో రాజీకి వచ్చినట్టు విజిలెన్స్ నివేదికలో వెల్లడైందని పేర్కొన్నారు.
ఆ పోలీసు అధికారి ఎవరు? అన్నది బయటపెట్టాలని డీజీపీ ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. హుండీలో దొంగ తనం చేసిన వారి నుంచి డబ్బులు బహుమతిగా తీసుకోవడం ఏంటని? ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన అవకతవకల పై విచారణ జరగాలని తేల్చిచెప్పారు. ఓ క్లర్కు స్థాయి వ్యక్తి ని కాపాడుతోంది ఎవరు? అనేది తెలియాలన్నారు. గత ప్రభుత్వ హయాంలో పోలీసు సర్వీసును పొలిటికల్ సర్వీసు గా మార్చారని TTD పాలకమండలి సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి విమర్శించారు.
తిరుమలలో గదులు పొందడం మరింత సులభం - టీటీడీ కీలక నిర్ణయం
కొండపై ఎవరు రాజకీయ వ్యాఖ్యలు చేసినా సహించేది లేదు: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు