గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో కరోనా కలకలం రేపుతోంది. కార్పొరేషన్లో పని చేస్తున్న ఐదుగురికి కరోనా నిర్ధరణ అయ్యింది. ఉప కమిషనర్‌తో పాటు ఇంజనీరింగ్ విభాగంలోని అధికారి, మరో ముగ్గురు ఉద్యోగులకు కరోనా సోకింది. మొదటగా ఓ క్లర్క్‌కు కరోనా రాగా కార్యాలయంలోని అందరికీ పరీక్షలు చేయించారు. దీంతో మరో నలుగురికి పాజిటివ్ నిర్ధరణ అయ్యింది.
ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు నగరపాలక సంస్థ కార్యాలయాన్ని క్రిమి సంహారక మందుతో శుద్ధి చేయించారు. అలాగే ఉద్యోగులు భౌతిక దూరం పాటించి విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ఎవరైనా అనారోగ్యం పాలైతే ఇళ్లలోనే ఉండాలని సూచించారు.
ఇదీ చదవండి: కరోనా వేళ... ఎంసెట్ ఎలా? విద్యార్థుల్లో సందేహాలు