- ప్రభుత్వంపై చంద్రబాబు దుష్ప్రచారం.. ఇచ్చిన ప్రతి హామీని సీఎం అమలు చేస్తున్నారు: మంత్రి రోజా
Roja: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాయటంలో అర్థం లేదని పర్యాటకశాఖ మంత్రి రోజా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారని ఆమె అన్నారు.
- ఇప్పటంలో ఇళ్లు కోల్పోయిన వారికి నేడు పరిహారం ఇవ్వనున్న పవన్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ఇప్పటం గ్రామం ప్రజలతో భేటీ కానున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన వారికి పార్టీ తరుపున పరిహారం అందించనున్నారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో బాదితులకు లక్ష రూపాయల చొప్పున పరిహరం అందించనున్నారు.
- తాడిపత్రిలో విశ్రాంత అధికారి పోరాటం.. ఎమ్మెల్యే అనుచరుల దౌర్జన్యంపై ఆవేదన
Retired JD couple fight for justice in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే అనుచరులు.. దౌర్జన్యం చేస్తున్నారంటూ ఓ విశ్రాంత అధికారి మౌనదీక్షకు దిగారు. కబ్జాకు గురైన భూములను కాపాడాలంటూ.. రెవెన్యూ, పోలీసు అధికారుల చుట్టూ తిరిగినా లాభం లేకపోయిందని. న్యాయం కోరినా వైసీపీ ఎమ్మెల్యే స్పందించలేదని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటలో ఏడాది కాలంగా వైసీపీ నాయకులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న.. భూగర్భ జలశాఖ విశ్రాంత జేడీ దంపతుల ఆవేదన ఇది.
- నెల్లూరు నగర తెదేపా ఇంచార్జ్‌ని కారుతో ఢీకొట్టి పరారైన యువకుడు..
Kotamreddy Srinivasulu Reddy:నెల్లూరు జిల్లాలో తెదేపా నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డిని రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు కారుతో ఢీకొట్టాడు. శ్రీనివాసులరెడ్డిని కుటుంబ సభ్యులు అపోలో ఆస్పత్రికి తరలించారు. రాజశేఖర్ రెడ్డి తాగి కోటంరెడ్డి ఇంటికి వచ్చి గొడవ చేశాడని, సర్ధిచెప్పే క్రమంలో కారుతో ఢీకొట్టి పరారైనట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
- సర్పంచ్‌గా గెలిచిన వ్యక్తికి నోట్లదండ.. ఓడిన అభ్యర్థికి రూ.11 లక్షల నగదు, కారు, భూమి
హరియాణాలో అరుదైన ఘటన జరిగింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిపాలైన ఓ అభ్యర్థికి గ్రామస్థులు భారీగా నగదు, కారు, కొంత భూమిని గిఫ్ట్‌గా ఇచ్చారు. మరోవైపు, ఫరీదాబాద్‌లోని ఓ గ్రామానికి సర్పంచ్‌గా ఎన్నికైన వ్యక్తికి రూ.11 లక్షల విలువైన నగదుతో మాల వేసి సన్మానించారు.
- రాజకీయ చట్రంలో 'రాజ్యాంగ' సంస్థలు.. అడుగడుగునా అడ్డంకులు.. సంస్కరణలు అవసరమే!
ప్రజాస్వామ్య పరిపుష్టికి, పౌరుల ప్రాథమిక హక్కుల రక్షణకు స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థలను భారత రాజ్యాంగం కొలువుతీర్చింది. పార్లమెంటు చట్టాల ద్వారా కొన్ని చట్టబద్ధ సంస్థలూ ఏర్పాటయ్యాయి. పోనుపోను అవి నీరుగారిపోతుండటంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
- కూచిపూడి నృత్యంతో అదరగొట్టిన సునాక్ కుమార్తె.. భారత్‌కు వెళ్లడమే ఇష్టమంటూ..
Rishi Sunak Daughter : బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తొమ్మిదేళ్ల కుమార్తె అనౌష్క కూచిపూడి నృత్యంతో ఆకట్టుకుంది. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె నృత్య ప్రదర్శన ఇచ్చింది.
- పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- 'భారత్ చాలా పవర్ఫుల్.. మాపై ఎవరూ అధికారం చూపించలేరు'.. రమీజ్‌కు కేంద్రమంత్రి కౌంటర్
వచ్చే ఏడాది పాక్ వేదికగా జరిగే ఆసియా కప్‌లో భారత్ ఆడకపోతే.. వన్డే ప్రపంచకప్‌లో తమ జట్టు పాల్గొనబోదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రజా చేసిన కీలక వ్యాఖ్యలపై కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. ఏమన్నారంటే?
- మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన బాలకృష్ణ
నటసింహం బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ సినీ ఇండస్ట్రీ ఎంట్రీపై ఎంతోకాలంగా వార్తలు వస్తున్నాయి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటుడిగా ఆయన వెండితెరకు పరిచయం కానున్నారని పలు కథనాలు కూడా వచ్చాయి. తాజాగా బాలకృష్ణ వీటిపై స్పందించారు. ఏమన్నారంటే?
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @11 AM - ఏపీ ముఖ్యవార్తలు
ఏపీ ప్రధాన వార్తలు
![TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @11 AM TOPNEWS](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-17043416-thumbnail-3x2-noname.jpg?imwidth=3840)