మద్యం, దూమపానం జోలికి వెళ్లొద్దని హస్యనటుడు బ్రహ్మానందం కాకినాడ ప్రజలకు సూచించారు. పొగాకు కాల్చడం మన సంస్కృతి కాదని బిట్రీష్ వారి నుంచి అలవాటైందని తెలిపారు. టీం ఆసుపత్రి ఛైర్మన్ వీర్రాజు పేదలకు చేస్తున్న సేవలను అభినందనీయమని బ్రహ్మానందం, మంత్రి కన్నబాబు కొనియాడారు. అంతకుముందు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా టీం ఆసుపత్రి ఆధ్వర్యంలో కాకినాడలో వైద్య సిబ్బంది, విద్యార్థులు అవగాహనా ర్యాలీ నిర్వహించారు. కాకినాడు నాగమల్లితోట జంక్షన్ నుంచి జెఎన్‌టీయూ మీదుగా ఈ ర్యాలీ సాగింది.
ఇదీ చదవండి: కర్నూలు వైద్య కళాశాలలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం