ఇటీవల గోదావరిలో వచ్చిన వరదకు నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. గోదావరి ఉద్ధృతిని చూసేందుకు సందర్శకులు బారులు తీరుతున్నారు. రాజమహేంద్రవరంలోని వివిధ ఘాట్లు పర్యాటకులతో కిక్కిరిసిపోతున్నాయి. పుష్కరఘాట్, సరస్వతీ ఘాట్, గౌతమీఘాట్ ప్రాంతాల్లో రోడ్లన్నీ రద్దీగా మారాయి. గోదారమ్మను తమ చరవాణిల్లో బంధించి, స్వీయచిత్రాలు తీసుకునేందుకు ఔత్సాహికులు పోటీ పడుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద కూడా ప్రకృతి ప్రేమికులు భారీగా తరలివస్తున్నారు.
ఇది చూడండి:వెంకయ్య పుస్తకాన్ని ఆవిష్కరించిన అమిత్షా