తూర్పు గోదావరి జిల్లాలో మరో 2 కరోనా పాజిటివ్ కేసులు వెలుగు చూసిన పరిస్థితుల్లో.. జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. రాజమహేంద్రవరానికి చెందిన పాజిటివ్ లక్షణాలు ఉన్న యువకుడు కోలుకుంటున్న నేపధ్యంలో... తాజాగా కాకినాడలోని 49 ఏళ్ల వ్యక్తితో పాటు రాజమహేంద్రవరం ప్రాంతానికి చెందిన 72 ఏళ్ల వృద్ధునిలో కరోనా లక్షణాలు గుర్తించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆయా కార్పొరేషన్ల అధికారులు అప్రమత్తమై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.
కాకినాడ, రాజమహేంద్రవరంలోని పీడిత ప్రాంతాల్లోకి ఇతరులు ఎవ్వరూ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఈనెల 14న దిల్లీలో జరిగిన మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన క్రమంలోనే వీరిద్దరికీ కరోనా సోకినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చారు. పీడితులు ఎవరెవరిని కలిశారని ఆరా తీస్తున్న అధికారులు.. వారిని ప్రత్యేక సంరక్షణలో ఉంచి చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఈ 2 కరోనా పాజిటివ్ కేసుల కుటుంబీకులను కాకినాడలోని జీజీహెచ్‌కు తరలించారు.
ఇవీ చదవండి: