తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక వద్ద నాటుసారా స్థావరాలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. 5 వేల 250 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు.
సారా తయారీ వస్తువులను స్వాధీనం చేసుకొని..కేసులు నమోదు చేశారు. గ్రామాల్లో ఎవరైనా నాటుసారా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.