గోదావరి వరదలు లంక గ్రామాల ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పి. గన్నవరం నియోజకవర్గం చాకలిపాలెం సమీపంలో గల కనకాయలంక వద్ద కాజ్వే పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. దీంతో ప్రజలు నాటుపడవల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం మర పడవలను తక్కువ సంఖ్యలో ఏర్పాటు చేయటంతో నాటు పడవల ద్వారా గోదావరి నది పాయలు దాటి ఆవతలి వైపునకు వెళ్లాల్సి వస్తుంది. ప్రభుత్వం స్పందించి మరిన్ని మర పడవలను ఏర్పాటు చేయాలని కనకాయలంక ప్రజలు కోరుతున్నారు.
వరద నీటితో ఇబ్బందులు పడుతున్న లంక గ్రామాల ప్రజలు - kankayalanka latest news
తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి వరదల దాటికి లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాకలిపాలెం సమీపంలోని కనకాయలంక వద్ద కాజ్వే పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది.

వరద నీటితో ఇబ్బందులు పడుతున్న లంక గ్రామాల ప్రజలు