కొవిడ్ బాధితులను ఆదుకునేందుకు ప్రవాసాంధ్రులు ముందుకు వచ్చారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం పెదపళ్ల గ్రామానికి చెందిన ఎన్నారై మంజుల రూ. 3లక్షలు విలువైన వైద్య పరికరాలు పీహెచ్సీకి అందించారు. రెండు ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, పల్స్ ఆక్సిమీటర్లు, మాస్కులు, ఇతర పరికరాలు అందించారు.
గారపాటి మంజుల అమెరికాలో వైద్యురాలిగా సిర్థపడ్డారు. అడాప్ట్ ఎ విలేజ్ గ్లోబల్ ఫౌండేషన్. స్నేహితులు ముప్పన సరస్వతి, శారద, సుష్మాల సహకారంతో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పెదపళ్ల గ్రామస్థులు మంజలకు అభినందనలు తెలిపారు.
ఇదీ చదవండి: