ETV Bharat / state

'వేసవిలో కళ తప్పిన ప్రత్తిపాడు జలాశయాలు' - chandrababu_sagar

వేసవి ప్రభావం ప్రత్తిపాడులోని ప్రధాన జలాశయాల్లో పడింది. సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్​లలో నీరులేక వెలవెలబోతున్నాయి.

'వేసవిలో కళ తప్పిన ప్రధాన జలాశయాలు'
author img

By

Published : Jun 4, 2019, 7:17 AM IST

తూర్పు గోదావరి జిల్లా మెట్ట ప్రాంతంలోని ప్రధాన నియోజకవర్గమైన ప్రత్తిపాడులోని జలాశయాల్లో నీటిమట్టం తగ్గిపోయి కళను కోల్పోయాయి. నీటి మట్టం పూర్తిగా తగ్గిపోయి చంద్రబాబు సాగర్, సుబ్బారెడ్డి సాగర్​లు అడుగంటాయి.

మండలంలోని సుబ్బారెడ్డి సాగర్, చంద్రబాబు సాగర్, ఏలేరు జలశయాలు ప్రధానమైనవి కాగా కేవలం ఏలేరు మాత్రమే జలకళను సంతరించుకుంది. దీనికి ప్రధాన కారణం తెదేపా ప్రభుత్వ హయంలో పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా ఏలేరు జలాశయంను గోదావరి జలాలతో నింపింది. ఏలేరు సహజ సామర్ధ్యమైన 24 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగారు. ఈ కారణంగానే వేసవిలోను ఏలేరు నిండుకుండను తలపిస్తోంది.

సుమారు 10వేల ఎకరాల ఆయకట్టుకు సుబ్బారెడ్డి సాగర్, 6వేల ఎకరాలకు చంద్రబాబు సాగర్ సాగునీరుని అందిస్తోంది. ఇక విశాఖ వాసుల దాహర్తిని తీర్చేందుకు...స్టీల్ ప్లాంట్​కు అవసరమైన నీటిని ఏలేరు జలాశయం ద్వారా పంపిణీ చేస్తున్నారు.

'వేసవిలో కళ తప్పిన ప్రత్తిపాడు జలాశయాలు'

Intro:ap_rjy_61_02_sagarlu_neeti mattam_c10

Body:ap_rjy_61_02_sagarlu_neeti mattam_c10

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.